ఎట్టకేలకు లాభాల్లో మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు మార్కెట్లు లాభాలను చూశాయి. భారీ నష్టాల నుంచి నెమ్మదిగా కోలుకున్న మార్కెట్లు బుధవారం కీలక సూచీల లాభనష్టాల మధ్య ఊగిసలాట అనంతరం చివరికి లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభం తర్వాత నష్టాల్లో ట్రేడైనప్పటికీ లంచ్ సమయం తర్వాత లాభాల్లోకి కదలాడాయి. చివరి గంటలో ఊపందుకున్న సెన్సెక్స్ 232.24 పాయింట్లు లాభపడి 31,685 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 65.30 పాయింట్ల లాభంతో 9,270 వద్ద ముగిసింది. బుధవారం ముఖ్యంగా ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగం షేర్లు […]

Update: 2020-05-06 06:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు మార్కెట్లు లాభాలను చూశాయి. భారీ నష్టాల నుంచి నెమ్మదిగా కోలుకున్న మార్కెట్లు బుధవారం కీలక సూచీల లాభనష్టాల మధ్య ఊగిసలాట అనంతరం చివరికి లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభం తర్వాత నష్టాల్లో ట్రేడైనప్పటికీ లంచ్ సమయం తర్వాత లాభాల్లోకి కదలాడాయి. చివరి గంటలో ఊపందుకున్న సెన్సెక్స్ 232.24 పాయింట్లు లాభపడి 31,685 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 65.30 పాయింట్ల లాభంతో 9,270 వద్ద ముగిసింది. బుధవారం ముఖ్యంగా ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగం షేర్లు మార్కెట్లకు ఊతమిచ్చాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, ఐసిఐసి బ్యాంక్ షేర్లు లాభపడగా, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఇక, యూఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ 17 పైసలు క్షీణించి రూ. 76.76 వద్ద ఉంది.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News