ఎట్టకేలకు లాభాల్లో మార్కెట్లు
దిశ, వెబ్‌డెస్క్: గత వారం వరుస నష్టాలను నమోదు చేసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) సోమవారం లాభాల బాట (path to profitability) పట్టాయి. ఉదయం ప్రారంభమే వంద పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడయిన సూచీలు (Indices)అనంతరం రోజంతా ఒడిదుడుకుల్లోనే కదలాడాయి. అయితే, చివరి గంటలో కొంత బలపడటంతో స్టాక్ మార్కెట్లు (Stock markets) లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల (International markets) ప్రభావంతో ప్రారంభమైన తర్వాత మార్కెట్లు కొంత ఊగిసలాటకు లోనయ్యాయని, […]
దిశ, వెబ్‌డెస్క్: గత వారం వరుస నష్టాలను నమోదు చేసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) సోమవారం లాభాల బాట (path to profitability) పట్టాయి. ఉదయం ప్రారంభమే వంద పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడయిన సూచీలు (Indices)అనంతరం రోజంతా ఒడిదుడుకుల్లోనే కదలాడాయి. అయితే, చివరి గంటలో కొంత బలపడటంతో స్టాక్ మార్కెట్లు (Stock markets) లాభాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్ల (International markets) ప్రభావంతో ప్రారంభమైన తర్వాత మార్కెట్లు కొంత ఊగిసలాటకు లోనయ్యాయని, మెటల్, ఆటో రంగాల (Metal, auto sectors)సానుకూల సంకేతాలతో మార్కెట్లకు కలిసొచ్చాయని మార్కెట్ నిపుణులు (Market experts) భావిస్తున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 173.44 పాయింట్ల లాభంతో 38,050 వద్ద ముగియగా, నిఫ్టీ (Nifty)81 పాయింట్లు లాభపడి 11,259 వద్ద ముగిసింది.
ముఖ్యంగా నిఫ్టీ(Nifty)లో మెటల్, ఆటో, మీడియా రంగాలు (Metal, auto, media sectors) అధిక లాభాలతో పుంజుకోగా, రియల్టీ, ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు( realty, private banks, IT, FMCG sectors Shares)స్వల్పంగా లాభపడ్డాయి. ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు (pharma and public sector banks Shares)డీలాపడ్డాయి.
సెన్సెక్స్ ఇండెక్స్‌లో (Sensex Index) ఎన్‌టీపీసీ (NTPC), బజాజ్ ఆటో (Bajaj Auto), టెక్ మహీంద్రా (Tech Mahindra), ఓఎన్‌జీసీ (ONGC), మారుతీ సుజుకి (Maruti Suzuki), టైటాన్ (Titan), ఏషియన్ పెయింట్ (Asian Paint), ఎల్అండ్‌టీ (L&T), పవర్‌గ్రిడ్ (PowerGrid), బజాజ్ ఫైనాన్స్ ( Bajaj Finance), కోటక్ బ్యాంక్ (Kotak Bank), టాటాస్టీల్ (Tata Steel) షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా… ఎస్‌బీఐ ( SBI), భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel), రిలయన్స్ (Reliance), సన్‌ఫార్మా (Sun pharma), ఐసీఐసీఐ (Icici), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 74.88 గా ఉంది.