వరుస లాభాలకు బ్రేక్..!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. అమెరికా మార్కెట్లలో ప్యాకేజీపై సందేహాలు కొనసాగడంతో దేశీయంగా మదుపర్లు అమ్మకాలకు సిద్ధపడ్డారు. ఆర్థికవ్యవస్థను కాపాడేందుకు భారీ ప్యాకేజీని ప్రకటించే అంశంలో అనిశ్చితి కొనసాగుతుండటంతో అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలహీనపడిందని, ఈ పరిణామాలకు తోడు దేశీయంగా ఇటీవల వరుస లాభాల కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరతీశారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. రోజంతా దేశీయ మార్కెట్లు బలహీనంగానే కదలాడి చివర్లో నష్టాలను నమోదు చేసినట్టు విశ్లేషకులు తెలిపారు. […]

Update: 2020-10-22 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. అమెరికా మార్కెట్లలో ప్యాకేజీపై సందేహాలు కొనసాగడంతో దేశీయంగా మదుపర్లు అమ్మకాలకు సిద్ధపడ్డారు. ఆర్థికవ్యవస్థను కాపాడేందుకు భారీ ప్యాకేజీని ప్రకటించే అంశంలో అనిశ్చితి కొనసాగుతుండటంతో అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలహీనపడిందని, ఈ పరిణామాలకు తోడు దేశీయంగా ఇటీవల వరుస లాభాల కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరతీశారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

రోజంతా దేశీయ మార్కెట్లు బలహీనంగానే కదలాడి చివర్లో నష్టాలను నమోదు చేసినట్టు విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 148.82 పాయింట్లు కోల్పోయి 40,558 వద్ద ముగియగా, నిఫ్టీ 41.20 పాయింట్ల నష్టంతో 11,896 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటో రంగాలు బలహీనపడగా, మెటల్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, మీడియా రంగాలు స్వల్పంగా పుంజుకున్నాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, ఎల్అండ్‌టీ షేర్లు లాభపడగా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ అత్యధికంగా 3 శాతం డీలాపడింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లె ఇండియా, మారుతీ సుజుకి, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.70 వద్ద ఉంది.

Tags:    

Similar News