మార్కెట్లకు ప్యాకేజీ ఇచ్చిన బలం!

కరోనా మహమ్మారిని నిలువరించేందుకు కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడంతో గురువారం కూడా మార్కెట్లు లాభాల్తో ముగిశాయి. ప్యాకేజీపై మదుపర్లలో అంచనాలు ఎక్కువగా ఉండటంతో సూచీలు అత్యధికంగా పెరిగాయి, అయితే..ఉద్దీపన ప్యాకేజీ అంచనాలను అందుకోలేకపోవడంతో మొదట్లో వచ్చిన లాభాలు తగ్గాయి. ఉదయం వరకూ ప్యాకేజీపై అంచనాల సంకేతాలతో బ్యాంకింగ్ రంగం అత్యధిక లాభాలతో ట్రేడవగా..మిగిలిన రంగాలు సైతం అధిక కొనుగోళ్లతో ఎగిశాయి. […]

Update: 2020-03-26 05:20 GMT

కరోనా మహమ్మారిని నిలువరించేందుకు కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడంతో గురువారం కూడా మార్కెట్లు లాభాల్తో ముగిశాయి. ప్యాకేజీపై మదుపర్లలో అంచనాలు ఎక్కువగా ఉండటంతో సూచీలు అత్యధికంగా పెరిగాయి, అయితే..ఉద్దీపన ప్యాకేజీ అంచనాలను అందుకోలేకపోవడంతో మొదట్లో వచ్చిన లాభాలు తగ్గాయి.

ఉదయం వరకూ ప్యాకేజీపై అంచనాల సంకేతాలతో బ్యాంకింగ్ రంగం అత్యధిక లాభాలతో ట్రేడవగా..మిగిలిన రంగాలు సైతం అధిక కొనుగోళ్లతో ఎగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1410.99 పయింట్లు లాభపడి 29,946 వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ 516.80 పాయింట్ల లాభంతో 8,317 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్‌లో అన్ని సూచీలు లాభాల్లో కదలాడగా, తిలయన్స్, మారుతీ సుజుకి, సన్‌ఫార్మా సూచీలు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.

Tags :sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News