విలవిల్లాడుతున్న మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ మార్కెట్లకు కోలుకోలేని దెబ్బ పడింది. ఇప్పటికే కరోనా ధాటికి విలవిల్లాడుతున్న మార్కెట్లకు ఈ వారాంతం కూడా భారీ నష్టాలు తప్పలేదు. ప్రైవేట్ బ్యాంకు యెస్ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచింది. రూ. 50,000 విత్‌డ్రా పరిమితి విధించడం కూడా మార్కెట్ల పతనానికి కారణమైంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్కెట్లకు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయోననే ఆందోళనతో మదుపర్లు విక్రయాలకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో […]

Update: 2020-03-05 23:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ మార్కెట్లకు కోలుకోలేని దెబ్బ పడింది. ఇప్పటికే కరోనా ధాటికి విలవిల్లాడుతున్న మార్కెట్లకు ఈ వారాంతం కూడా భారీ నష్టాలు తప్పలేదు. ప్రైవేట్ బ్యాంకు యెస్ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచింది. రూ. 50,000 విత్‌డ్రా పరిమితి విధించడం కూడా మార్కెట్ల పతనానికి కారణమైంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్కెట్లకు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయోననే ఆందోళనతో మదుపర్లు విక్రయాలకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ప్రారంభ మార్కెట్లు ఏకంగా 1,400 పాయింట్ల వరకూ చూసింది.

ప్రస్తుతం కొంత కోలుకున్నప్పటికీ సెన్సెక్స్ 1186.02 పాయింట్లను కోల్పోయి 37,284 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 363.50 పాయింట్ల నష్టంతో 10,905 వద్ద కొనసాగుతోంది. ఆంక్షలకు బలైన యెస్ బ్యాంకు షేర్లు 15 శాతం నష్టాలను మూటగట్టుకోగా, మార్కెట్లు ఆరు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. ఆటో, మెటల్ రంగాల షేర్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఎస్‌బీఐ సహా బ్యాంకింగ్ షేర్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇండస్ఇండి, టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ అత్యధిక శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లోని సూచీలన్నీ భారీ పతనాలకు లోనయ్యాయి. రూపాయి మారకం విలువ సైతం ఏకంగా రూ. 74.07 స్థాయిని చేరుకుంది.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News