మార్కెట్ల నెత్తిన కరోనా పిడుగు.. చరిత్రలోనే భారీ పతనం!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ధాటికి అంతర్జాతీయ మార్కెట్ల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ప్రభావంతో దేశీయ మార్కెట్లకు భారీ నష్టం తప్పలేదు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా దేశీయ స్టాక్ మార్కెట్లోని హెవీ వెయిట్ షేర్లన్నీ 52 వారాల కనిష్ఠానికి దిగజారిపోయాయి. ఉదయం భారీ నష్టాలను ఎదుర్కొని, లంచ్ వరకూ స్థిరంగా కదిలిన సూచీలూ మార్కెట్ చివరి గంటలో సెన్సెక్స్ 2919.26 పాయింట్ల భారీ నష్టాలను ఢీకొనగా, నిఫ్టీ 868.25 పాయింట్ల నష్టంతో 9,590 వద్ద క్లోజయింది. […]

Update: 2020-03-12 05:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ధాటికి అంతర్జాతీయ మార్కెట్ల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ప్రభావంతో దేశీయ మార్కెట్లకు భారీ నష్టం తప్పలేదు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా దేశీయ స్టాక్ మార్కెట్లోని హెవీ వెయిట్ షేర్లన్నీ 52 వారాల కనిష్ఠానికి దిగజారిపోయాయి. ఉదయం భారీ నష్టాలను ఎదుర్కొని, లంచ్ వరకూ స్థిరంగా కదిలిన సూచీలూ మార్కెట్ చివరి గంటలో సెన్సెక్స్ 2919.26 పాయింట్ల భారీ నష్టాలను ఢీకొనగా, నిఫ్టీ 868.25 పాయింట్ల నష్టంతో 9,590 వద్ద క్లోజయింది. నిఫ్టీ భారీ పతనంతో 32 నెలల కనిష్ఠానికి పడిపోయింది.

ప్రధానంగా మెటల్ ఇండెక్స్ 3 ఏళ్ల కనిష్ఠానికి, నిఫ్టీ బ్యాంక్ రికార్డు స్థాయిలో పతనానికి గురయ్యాయి. ఒక్క రోజులో సెన్సెక్స్, నిఫ్టీ ఈ స్థాయిలో పతనమవడం స్టాక్‌మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి. యెస్‌బ్యాంక్, బీపీసీఎల్ పదిహేను శాతానికి పైగా పడిపోగా, వేదాంతా, ఎస్‌బీఐ, ఐటీసీ సంస్థలు 13 శాతానికి మించి నష్టాలను చూశాయి.

కరోనా వైరస్ మార్కెట్ల సెంటిమెంట్‌ను ఆధిపత్యం చేస్తుందనే భయంతో సెన్సెక్స్, నిఫ్టీ నిన్నటి విరామ తర్వాత గురువారం అమ్మకాల ఒత్తిడితో విలవిల్లాడాయి. ఇంట్రాడేలో ఒక్కరోజే 8.7 శాతం పడిపోయింది. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థలలో మాంద్యం పెరుగుతుందనే భయాల మధ్య మదుపర్లలో ఆందోళన పెరిగింది. దీనికితోడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించడంతో చమురు ధరలు మరింత క్షీణించాయి. దీంతో మార్కెట్లకు భారీ నష్టం తప్పలేదు.

మార్కెట్లు ప్రారంభమైన గంటల వ్యవధిలోనే అంతర్జాతీయ పరిణామాలతో సెన్సెక్స్ 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ అత్యధికంగా 11 శాతం నుంచి 15 శాతాం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి. టాటా స్టీల్ షేర్ 10 శాతం క్షీణించగా, టైటాన్,ఎమ్అండ్ఎమ్ 8 శాతం, ఎల్ అండ్ టీ, రిలయన్స్ 7 శాతం క్షీణించాయి. యెస్ బ్యాంక్ 12.67% తగ్గి నిఫ్టీలో టాప్ లూజర్‌గా ట్రేడయింది. భారత్ పెట్రోలియం షేర్లు 12% తగ్గాయి. నిఫ్టీలో సన్ ఫార్మా, సిప్లా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 52 వారాల కనిష్ఠానికి చేరువలో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్ స్టాక్ ధర 52 వారాల గరిష్టానికి దగ్గరగా ఉంది.

కరెన్సీ మార్కెట్లో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. గత కొన్ని వారాలుగా దిగొస్తున్న రూపాయి గురువారం ఒక్కరోజే 61 పైసల మేర నష్టాలను చూసింది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ రూ. 73.61 వద్ద ఉంది.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News