కుప్పకూలిన మార్కెట్లు.. 10 వేలలోపు నిఫ్టీ!

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడం, మరోవైపు కరొణా చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో దేశీయ మార్కెట్లు కోలుకోలేని దెబ్బను అనుభవిస్తున్నాయి. ఒకరోజు లేచినట్టే అనిపించినా మళ్లీ కరోనా ఏదొవిధంగా ఆర్థికవ్యవస్థలను చావు దెబ్బ కొడుతూనే ఉంది. బుధవారం కాస్త నిలకడగా కొనసాగిన మార్కెట్లు గురువారం భారీగా నష్టాలను చవిచూశాయి. బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించడంతో మార్కెట్లు ఒక్కసారిగా అగాథాల్లోకి పడిపోయాయి. ఉదయం 10.30 సమయంలో సెన్సెక్స్ ఏకంగా 2003.12 పాయింట్లను కోల్పోయి […]

Update: 2020-03-12 00:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడం, మరోవైపు కరొణా చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో దేశీయ మార్కెట్లు కోలుకోలేని దెబ్బను అనుభవిస్తున్నాయి. ఒకరోజు లేచినట్టే అనిపించినా మళ్లీ కరోనా ఏదొవిధంగా ఆర్థికవ్యవస్థలను చావు దెబ్బ కొడుతూనే ఉంది. బుధవారం కాస్త నిలకడగా కొనసాగిన మార్కెట్లు గురువారం భారీగా నష్టాలను చవిచూశాయి. బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించడంతో మార్కెట్లు ఒక్కసారిగా అగాథాల్లోకి పడిపోయాయి.

ఉదయం 10.30 సమయంలో సెన్సెక్స్ ఏకంగా 2003.12 పాయింట్లను కోల్పోయి 33,695 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 625.50 పాయింట్ల భారీ నష్టంతో 9,832 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ ఏకంగా 10,000 మార్కు కంటే కిందకు దిగజారింది. సెన్సెక్స్ 33,700 కంటే కిందకు పడిపోయింది. ఇండెక్స్‌లోని సూచీలన్నీ భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి.

Tags:    

Similar News