మళ్లీ నష్టాల బాటలో మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా కరోనా భయాలు పెరుగుతుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత వల్ల యూఎస్ మార్కెట్లు అధిక నష్టాలను నమోదు చేస్తున్నాయి. ఆ ప్రభావానికి తోడు దేశీయంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. శుక్రవారం బేర్ మార్కెట్ల స్థాయికి వెళ్లిన మార్కెట్లను 45 నిమిషాల పాటు మూసేశారు. అనంతరం మొదలైన మార్కెట్లు భారీగా లాభాలను చూశాయి. కానీ, దాన్ని కొనసాగించడంలో నేడు సూచీలు తడబడ్డాయి. […]

Update: 2020-03-15 23:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా కరోనా భయాలు పెరుగుతుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత వల్ల యూఎస్ మార్కెట్లు అధిక నష్టాలను నమోదు చేస్తున్నాయి. ఆ ప్రభావానికి తోడు దేశీయంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. శుక్రవారం బేర్ మార్కెట్ల స్థాయికి వెళ్లిన మార్కెట్లను 45 నిమిషాల పాటు మూసేశారు. అనంతరం మొదలైన మార్కెట్లు భారీగా లాభాలను చూశాయి. కానీ, దాన్ని కొనసాగించడంలో నేడు సూచీలు తడబడ్డాయి.

ఉదయం 10.45 గంటలకు సెన్సెక్స్ 1991.17 పాయింట్ల అత్యధిక నష్టాలతో 32,112 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం ఇదే బాటలో 455.20 పాయింట్లను కోల్పోయి 9,500 వద్ద కొనసాగుతోంది. సూచీల్లో యెస్ బ్యాంకు తప్పించి మిగిలిన కీలక సూచీలన్నీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. యెస్ బ్యాంకు అత్యధికంగా 31.30 శాతం లాభాలను చూడ్డం గమనార్హం. ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ బ్యాంకుకు తోడు ప్రైవేటు బ్యాంకులు పెట్టుబడులతో యెస్ బ్యాంకును ఆదుకోవడంతో ఈ స్థాయి లాభాలు నమోదవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, యూఎస్ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 74.31 వద్ద కొనసాగుతోంది.

Tags:    

Similar News