నష్టాల్లో కదలాడుతున్న మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయంగా కరోనా భయాలు ఇంకా వీడకపోవడంతో మార్కెట్లు లాభాలకు, నష్టాలకు మధ్య ఊగిసలాడుతున్నాయి. మంగళవారం లాభాలతో ముగిసిన మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతోనే మొదలైనప్పటికీ నెమ్మదిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 45.07 పాయింట్ల నష్టంతో 38,578 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 4 పాయింట్లను కోల్పోయి 11,299 వద్ద ట్రేడవుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లలో కోత వల్ల యూఎస్ మార్కెట్లకు నష్టాలు రావడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. […]

Update: 2020-03-03 23:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయంగా కరోనా భయాలు ఇంకా వీడకపోవడంతో మార్కెట్లు లాభాలకు, నష్టాలకు మధ్య ఊగిసలాడుతున్నాయి. మంగళవారం లాభాలతో ముగిసిన మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతోనే మొదలైనప్పటికీ నెమ్మదిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 45.07 పాయింట్ల నష్టంతో 38,578 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 4 పాయింట్లను కోల్పోయి 11,299 వద్ద ట్రేడవుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లలో కోత వల్ల యూఎస్ మార్కెట్లకు నష్టాలు రావడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సెన్సెక్స్‌లో సన్‌ఫార్మా అత్యధికంగా 4.05 శాతంతో ట్రేడవుతోంది. ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్ అధిక నష్టాలతో కొనసాగుతున్నాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News