వికాస్ దుబే భార్య అరెస్ట్.. సంచలనాలు బయటపెట్టిన గ్యాంగ్ స్టర్
దిశ, వెబ్ డెస్క్: కాన్పూర్ లో 8 మంది పోలీసులపై కాల్పులు జరిపి హత్య చేసిన గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే కేసులో తాజాగా ఆయన భార్య, కుమారుడు, పని మనుషులను లక్నోలోని కృష్ణానగర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వారి పాత్రపై విచారణ చేపట్టనున్నారు. కాగా గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే భార్య సమాజ్ వాదీ పార్టీ నాయకులుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఆమె అక్కడ […]
దిశ, వెబ్ డెస్క్: కాన్పూర్ లో 8 మంది పోలీసులపై కాల్పులు జరిపి హత్య చేసిన గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే కేసులో తాజాగా ఆయన భార్య, కుమారుడు, పని మనుషులను లక్నోలోని కృష్ణానగర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వారి పాత్రపై విచారణ చేపట్టనున్నారు.
కాగా గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే భార్య సమాజ్ వాదీ పార్టీ నాయకులుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఆమె అక్కడ జిల్లా పరిషత్ సభ్యురాలని సమాచారం. మరోవైపు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో దుబేను అరెస్ట్ చేసిన పోలీసులు ఉత్తర ప్రదేశ్ పోలీసులకు అప్పగించారు. దుబేను యూపీకి తరలించిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
పోలీసులు విచారణలో గ్యాంగ్ స్టర్ సంచలన విషయాలు బయట పెడుతున్నట్లు సమాచారం. పోలీసులు తనకు పట్టుకోవడానికి వస్తున్నారని తనకు పోలీసుల నుంచే సమాచారం అందిందని, పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారనే భయంతోనే ముందస్తు ప్లాన్ తో వారి కాల్చి చంపినట్లు పేర్కొన్నట్లు సమాచారం. పోలీసులపై దాడి తర్వాత తన అనుచరులు ఎలా తప్పించుకోవాలో ముందే రెక్కి నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు తెలిసింది