కరోనా వేళ ప్రభుత్వానికి షాక్.. సమ్మె నోటీసులు ఇచ్చిన డాక్టర్లు
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 9 నుంచి విధులు బహిష్కరించనున్నట్టు సీనియర్, జూనియర్ రెసిడెంట్ వైద్యులు ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆరోగ్య బీమా, పరిహారం కొవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నోటీసుల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, ఆసుపత్రుల్లో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలన్నారు. స్టైఫండ్‌లో టీడీఎస్ కట్ చేయకూడదని తేల్చి చెప్పారు. వీటిని వెంటనే పరిష్కరించాలని.. లేనిపక్షంలో సమ్మెకు దిగుతామన్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 9 న నాన్ కొవిడ్ సేవలు, 10 న […]
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 9 నుంచి విధులు బహిష్కరించనున్నట్టు సీనియర్, జూనియర్ రెసిడెంట్ వైద్యులు ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆరోగ్య బీమా, పరిహారం కొవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నోటీసుల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, ఆసుపత్రుల్లో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలన్నారు. స్టైఫండ్‌లో టీడీఎస్ కట్ చేయకూడదని తేల్చి చెప్పారు. వీటిని వెంటనే పరిష్కరించాలని.. లేనిపక్షంలో సమ్మెకు దిగుతామన్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 9 న నాన్ కొవిడ్ సేవలు, 10 న కొవిడ్ సంబంధిత సేవలు, 11 న నాన్ కొవిడ్ అత్యవసర సేవలు, జూన్ 12 న కొవిడ్ సంబంధిత అత్యవసర విధుల బహిష్కరిస్తామని సమ్మె నోటీసులో స్పష్టం చేస్తూ.. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.