కరోనాతో సీనియర్ జర్నలిస్ట్ జగన్ కన్నుమూత..

దిశ, స్టేషన్ ఘన్‌పూర్ : కరోనా కాటుకు మరో జర్నలిస్ట్ బలయ్యారు. ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చిలుపూరు జగన్(50) కరోనా బారినపడి తుదిశ్వాస విడిచారు. వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున జగన్ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక […]

Update: 2021-06-02 05:33 GMT

దిశ, స్టేషన్ ఘన్‌పూర్ : కరోనా కాటుకు మరో జర్నలిస్ట్ బలయ్యారు. ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చిలుపూరు జగన్(50) కరోనా బారినపడి తుదిశ్వాస విడిచారు. వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున జగన్ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే.. జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ తరుఫున రూ. 25 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయన వెంట ఎంపీపీ రేఖ గట్టయ్య, వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి, కూడా డైరెక్టర్ ఆకుల కుమార్, జెడ్పీటీసీ రవి, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

 

Tags:    

Similar News