Telangana Formation Day : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అతిధుల నియామకం

దిశ, తెలంగాణ బ్యూరో : జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స వేడుక‌ల్లో పాల్గొనేందుకు జిల్లాల వారీగా ప్రజాప్రతినిధుల‌కు ప్రభుత్వం బాధ్యత‌ల‌ను అప్పగించింది. హైద‌రాబాద్‌లో నిర్వహించే వేడుక‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జెండాను ఆవిష్కరిస్తారు. కొవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు రాష్ర్ట ఆవిర్భావ వేడుక‌ల‌ను నిర్వహించ‌నున్నారు. 10 మందికి ఎక్కువగా పాల్గొన వద్దని, మాస్కు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని సూచించింది. బహుమతుల ప్రదానం నిర్వహించొద్దని సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతిధులుగా ఎంపికైంది వీరే… ఆదిలాబాద్‌లో […]

Update: 2021-05-31 11:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స వేడుక‌ల్లో పాల్గొనేందుకు జిల్లాల వారీగా ప్రజాప్రతినిధుల‌కు ప్రభుత్వం బాధ్యత‌ల‌ను అప్పగించింది. హైద‌రాబాద్‌లో నిర్వహించే వేడుక‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జెండాను ఆవిష్కరిస్తారు. కొవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు రాష్ర్ట ఆవిర్భావ వేడుక‌ల‌ను నిర్వహించ‌నున్నారు. 10 మందికి ఎక్కువగా పాల్గొన వద్దని, మాస్కు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని సూచించింది. బహుమతుల ప్రదానం నిర్వహించొద్దని సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అతిధులుగా ఎంపికైంది వీరే…

ఆదిలాబాద్‌లో ప్రభుత్వ విప్ గంప గోవ‌ర్ధన్, భ‌ద్రాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జ‌గిత్యాల – మంత్రి కొప్పుల ఈశ్వర్, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి – ప్రభుత్వ విప్ భానుప్రసాద్ రావు, జ‌న‌గామ – ప్రభుత్వ చీఫ్‌విప్ బోడ‌కుంటి వెంక‌టేశ్వర్లు, జోగులాంబ గ‌ద్వాల – ప్రభుత్వ విప్ గువ్వల బాల‌రాజు, కామారెడ్డి – స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఖ‌మ్మం – మంత్రి పువ్వాడ అజ‌య్, క‌రీంన‌గ‌ర్ – మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ – ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ – మంత్రి శ్రీనివాస్ గౌడ్, మ‌హ‌బూబాబాద్ – మంత్రి స‌త్యవ‌తి రాథోడ్, మంచిర్యాల – ప్రభుత్వ స‌ల‌హాదారు అనురాగ్ శ‌ర్మ, మెద‌క్ – మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మేడ్చల్ మ‌ల్కాజ్‌గిరి – మంత్రి చామకూర మ‌ల్లారెడ్డి, ములుగు – ప్రభుత్వ విప్ ప్రభాక‌ర్ రావు, నాగ‌ర్‌క‌ర్నూల్ – ప్రభుత్వ విప్ దామోద‌ర్ రెడ్డి, న‌ల్లగొండ – శాసన మండ‌లి చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, నారాయ‌ణ‌పేట – మండ‌లి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగ‌ర్ రావు, నిర్మల్ – మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, నిజామాబాద్ – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పెద్దప‌ల్లి – ప్రభుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి, రాజ‌న్న సిరిసిల్ల – మంత్రి కేటీఆర్, రంగారెడ్డి – మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, సంగారెడ్డి – మంత్రి మ‌హ‌ముద్ అలీ, సిద్దిపేట – మంత్రి హ‌రీష్ రావు, సూర్యాపేట – మంత్రి గుంటకండ్ల జ‌గ‌దీశ్ రెడ్డి, వికారాబాద్ – డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు, వ‌న‌ప‌ర్తి – మంత్రి నిరంజ‌న్ రెడ్డి, వ‌రంగ‌ల్ రూర‌ల్ – ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, వ‌రంగ‌ల్ అర్బన్ – ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం విన‌య్ భాస్కర్, యాదాద్రి భువ‌న‌గిరి – ప్రభుత్వ విప్ గొంగిడి సునీత‌ లు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండాను ఎగురవేయనున్నారు.

Tags:    

Similar News