శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

దిశ, శంషాబాద్ : విదేశీ కరెన్సీని అడ్డదారిలో అక్రమంగా తరలిస్తూ సీఐఎస్ఎఫ్ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం హైదరాబాద్ నుంచి(FZ-440) విమానంలో దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయం వచ్చిన సయ్యద్ ఖాలిద్ అనే ప్రయాణికునిపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించారు. దీంతో అతని లగేజ్ బ్యాగులో 13 లక్షల విలువ జేసే (65,000) సౌదీ రియాల్స్ స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని విచారణ […]

Update: 2021-11-08 01:48 GMT

దిశ, శంషాబాద్ : విదేశీ కరెన్సీని అడ్డదారిలో అక్రమంగా తరలిస్తూ సీఐఎస్ఎఫ్ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం హైదరాబాద్ నుంచి(FZ-440) విమానంలో దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయం వచ్చిన సయ్యద్ ఖాలిద్ అనే ప్రయాణికునిపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించారు. దీంతో అతని లగేజ్ బ్యాగులో 13 లక్షల విలువ జేసే (65,000) సౌదీ రియాల్స్ స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని విచారణ నిమిత్తం కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

 

Tags:    

Similar News