నల్లమలలో గంజాయి కలకలం
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో గంజాయి పట్టివేత కలకలం రేపుతోంది. గతకొంత కాలంగా నల్లమల నుంచి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా అవుతోందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రెండు వాహనాల్లో (షిఫ్టు డీజైర్ కారు, బైక్) గంజాయి తరలిస్తున్న ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ యువకులది హైదరాబాద్.. నల్లమలలో గంజాయితో పట్టుబడిన యువకులు హైదరాబాద్‌కు […]
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో గంజాయి పట్టివేత కలకలం రేపుతోంది. గతకొంత కాలంగా నల్లమల నుంచి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా అవుతోందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రెండు వాహనాల్లో (షిఫ్టు డీజైర్ కారు, బైక్) గంజాయి తరలిస్తున్న ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
పట్టుబడ్డ యువకులది హైదరాబాద్..
నల్లమలలో గంజాయితో పట్టుబడిన యువకులు హైదరాబాద్‌కు చెందిన వారు అని తెలిసింది. వారందరూ కూడా ఉన్నత చదువులు చదువుతోన్న వారని పోలీసులు గుర్తించారు. జిల్లాలోని వంగూరు మండలానికి చెందిన యువకుడి ద్వారా గంజాయి సరఫరాకు నల్లమలకు వచ్చినట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ యువకుల వెనకాల పెద్ద ముఠా, బడా నాయకుల హస్తం కూడా ఉన్నట్టు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్థానిక సీఐ బిసన్న తెలిపారు.