280 కిలోల ఎండు గంజాయి పట్టివేత
దిశ, పటాన్ చెరు: పటాన్ చెరు పారిశ్రామికవాడలో అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని మెదక్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆదివారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ మోహన్ కుమార్ వివరాలను వెల్లడించారు. మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కేఏబీ శాస్త్రి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ గాయత్రి ఆదేశాల మేరకు, విశ్వసనీయ సమాచారం ప్రకారం పటాన్ చెరు సమీపంలోని ముత్తంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా […]
దిశ, పటాన్ చెరు: పటాన్ చెరు పారిశ్రామికవాడలో అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని మెదక్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆదివారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ మోహన్ కుమార్ వివరాలను వెల్లడించారు. మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కేఏబీ శాస్త్రి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ గాయత్రి ఆదేశాల మేరకు, విశ్వసనీయ సమాచారం ప్రకారం పటాన్ చెరు సమీపంలోని ముత్తంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా స్కార్పియో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 2 కిలోల బరువు చొప్పున మొత్తం 140 ఎండు గంజాయి అక్రమంగా తరలిస్తున్న ప్యాకెట్లు లభించాయి. ఈ ఎండు గంజాయిని తరలిస్తున్న గోవిందాపూర్ తాండ జహీరాబాద్ మండలంకు చెందిన భానోత్ తులసి రామ్. రాంతీర్త్ గ్రామం న్యాల్కల్ మండలంకు చెందిన బ్యాగరి తుకారాం లుగా గుర్తించారు.
పట్టుబడిన 280 కిలోల గంజాయిని ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో నుండి జహీరాబాద్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఎండు గంజాయి తో పాటు స్కార్పియో వాహనం ( ఏపీ 11ఎసీ1301), స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు. పట్టుబడిన 280 కిలోల గంజాయి విలువ సుమారుగా 55 లక్షల రూపాయలు ఉంటుందని, పట్టుబడిన స్కార్పియో వాహనం విలువ 5 లక్షల ఉంటుందని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ మోహన్ కుమార్, పటాన్ చెరు ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డి, ఎస్ఐలు కె.విశ్వనాథ్, జి.రాజు, హెచ్ సి ఎం.డి అలీమ్, ఈసీలు ఎం.గోపాల్, డి.మలకయ్య, జె.రామారావు నాయక్, కె.సంధ్య తదితరులు పాల్గొన్నారు.