భద్రతా బలగాలకు తప్పిన పెనుముప్పు
దిశ, భద్రాచలం: పొరుగున ఉన్నఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాలకు పెనుముప్పు తప్పింది. నీలవాయి మార్గంలో రహదారి నిర్మాణానికి ఉపయోగిస్తున్న యంత్రాలు, వాహనాలకు కాపలా కాస్తున్న జవాన్లను మట్టుపెట్టడం కోసం మావోయిస్టులు మందుపాతరలు పాతిపెట్టారు. కాగా రోడ్డు తనిఖీల్లో భాగంగా రెండు శక్తివంతమైన మందుపాతరలను సీఆర్‌పీఎఫ్ 231 బెటాలియన్ డీ అండ్ ఎఫ్ కంపెనీ బలగాలు శుక్రవారం వెలికి తీశాయి. అనంతరం మందు పాతరలను నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మందుపాతరల్లో ఒకటి ఐదు […]
దిశ, భద్రాచలం: పొరుగున ఉన్నఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాలకు పెనుముప్పు తప్పింది. నీలవాయి మార్గంలో రహదారి నిర్మాణానికి ఉపయోగిస్తున్న యంత్రాలు, వాహనాలకు కాపలా కాస్తున్న జవాన్లను మట్టుపెట్టడం కోసం మావోయిస్టులు మందుపాతరలు పాతిపెట్టారు. కాగా రోడ్డు తనిఖీల్లో భాగంగా రెండు శక్తివంతమైన మందుపాతరలను సీఆర్‌పీఎఫ్ 231 బెటాలియన్ డీ అండ్ ఎఫ్ కంపెనీ బలగాలు శుక్రవారం వెలికి తీశాయి. అనంతరం మందు పాతరలను నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మందుపాతరల్లో ఒకటి ఐదు కిలోలు, మరొకటి 3కిలోల ఉన్నట్టు అధికారులు తెలిపారు. అరన్‌పూర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.