పార్టీల గుర్తుతో ఎన్నికలు జరిగేలా..
దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు పార్టీల గుర్తుతోనే జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. సోమవారం మంత్రి మల్లారెడ్డితో కలిసి బోర్డు సభ్యులు సాదాకేశవరెడ్డి, జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యుడు ప్రభాకర్ ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈసందర్భంగా బోర్డు సభ్యులు మాట్లాడుతూ.. 15వ వార్షిక బడ్జెట్ కేటాయింపులతో పాటు నీటి చార్జీల తగ్గింపు విషయమై కేటీఆర్ […]
దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు పార్టీల గుర్తుతోనే జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. సోమవారం మంత్రి మల్లారెడ్డితో కలిసి బోర్డు సభ్యులు సాదాకేశవరెడ్డి, జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యుడు ప్రభాకర్ ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈసందర్భంగా బోర్డు సభ్యులు మాట్లాడుతూ.. 15వ వార్షిక బడ్జెట్ కేటాయింపులతో పాటు నీటి చార్జీల తగ్గింపు విషయమై కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. కంటోన్మెంట్ సభ్యుడు కేశవరెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.4 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్ పార్లమెంట్ పార్టీ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.