ఆ రోజు మహిళా ఉద్యోగులకు సెలవు..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 26వ తేదీని ఆపన్షల్‌ హాలిడేగా ప్రకటించింది. దసరా ఆదివారం కావడంతో సెలవును సోమవారానికి మార్చాలని సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. దీంతో ఏపీ వ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు 26న సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు. మరోవైపు దసరా పండుగ హాలిడేను ఈనెల 26న తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం […]

Update: 2020-10-23 09:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 26వ తేదీని ఆపన్షల్‌ హాలిడేగా ప్రకటించింది. దసరా ఆదివారం కావడంతో సెలవును సోమవారానికి మార్చాలని సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. దీంతో ఏపీ వ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు 26న సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు.

మరోవైపు దసరా పండుగ హాలిడేను ఈనెల 26న తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయదశమి పండగ ఈనెల 25న జరగనుంది. ఇంతకు ముందే ప్రభుత్వం 25వ తేదీనే జనరల్‌ హాలిడేగా ప్రకటించింది. అయితే ప్రభుత్వం సోమవారం విజయదశమి సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సోమవారం 26వ తేదీన ఐచ్చిక సెలవుగా ప్రకటించింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవుగా ప్రకటిచింది.

Tags:    

Similar News