స్పేషియల్ మ్యాపింగ్‌లో తెలంగాణకు సెకండ్ ప్లేస్

దిశ, తెలంగాణ బ్యూరో: జనాగ్రహ సిటీ గవర్నెన్స్ అవార్డ్స్- 2020లో జియో స్పేషియల్ మ్యాపింగ్ ఆఫ్ అర్బన్ ప్రాపర్టీస్ రెవెన్యూ రిసోర్సెస్‌లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. జనాగ్రహ సిటీ గవర్నెన్స్ – 2020 అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మ్యాపింగ్‌ను సీడీఎంఏ పూర్తి చేసింది. యూఎల్‌బీల్లో ఆస్తులు, మేజర్ ఆదాయాన్నిచ్చే వనరులను ఎన్‌ఆర్ఎస్‌సీ చేపట్టింది. ఇందుకోసం భువన్ ఇంటిగ్రేటేడ్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటివరకూ ఎన్ఆర్ఎస్‌సీ […]

Update: 2021-01-12 11:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జనాగ్రహ సిటీ గవర్నెన్స్ అవార్డ్స్- 2020లో జియో స్పేషియల్ మ్యాపింగ్ ఆఫ్ అర్బన్ ప్రాపర్టీస్ రెవెన్యూ రిసోర్సెస్‌లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. జనాగ్రహ సిటీ గవర్నెన్స్ – 2020 అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మ్యాపింగ్‌ను సీడీఎంఏ పూర్తి చేసింది. యూఎల్‌బీల్లో ఆస్తులు, మేజర్ ఆదాయాన్నిచ్చే వనరులను ఎన్‌ఆర్ఎస్‌సీ చేపట్టింది. ఇందుకోసం భువన్ ఇంటిగ్రేటేడ్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటివరకూ ఎన్ఆర్ఎస్‌సీ 20లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తులను 1.45లక్షల ట్రేడ్ అసెస్‌మెంట్స్‌లను మ్యాపింగ్ పూర్తి చేసింది. దీంతో యూఎల్‌బిల్లో ఆదాయ వనరులు పెరుగుతాయి. మునిసిపాలిటీ పరిధిలో ఉన్న వారు మధ్యవర్తుల సహకారం లేకండా తన ఆస్తి వివరాలు తెలుసుకునేందుకు కూడా అవకాశం కలుగుతుంది.

Tags:    

Similar News