పీఆర్సీపై సీఎం జగన్‌తో రెండో రోజూ కొనసాగుతున్న చర్చలు..

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌లు అయిన పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అంశాలపై సీఎం వైఎస్ జగన్ రెండోరోజూ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి ఉదయం మరోసారి భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలతో మూడు రోజులుగా జరుగుతున్న చర్చలపై ఆరా తీశారు. గురువారం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్‌తో కలిసి […]

Update: 2021-12-17 09:41 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌లు అయిన పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అంశాలపై సీఎం వైఎస్ జగన్ రెండోరోజూ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి ఉదయం మరోసారి భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలతో మూడు రోజులుగా జరుగుతున్న చర్చలపై ఆరా తీశారు. గురువారం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్‌తో కలిసి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అన్ని హామీలను దశలవారీగా నెరవేరుస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ చర్చల్లో ఉద్యోగుల డిమాండ్లను సీఎం దృష్టికి మంత్రి బుగ్గన తీసుకెళ్లారు.

ఉద్యోగుల డిమాండ్ల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడుతుంది.. అందుకు నిధుల సమీకరణపై కూలంకషంగా చర్చించారు. సీపీఎస్ రద్దు, పీఆర్సీ పెంపు, ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి 71 డిమాండ్లపై చర్చించారు. ఈ డిమాండ్లు నెరవేరిస్తే ప్రభుత్వం పై ఎంత ఆర్థిక భారం పడుతుంది అనే దాని పై సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్లు నెరవేరిస్తే వచ్చే భారాన్ని ఎలా పూడ్చాలి..నిధులు ఏ విధంగా తీసుకురావాలో కూడా ఆలోచన చేయాలని సీఎం జగన్ సూచించారు. ఇకపోతే సోమవారం ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో పీఆర్సీ, ఫిట్‌మెంట్‌పై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News