17 ఏళ్ల బాలుడిపై ఎస్​ఈసీ తప్పు మీద తప్పు

దిశ, తెలంగాణ బ్యూరో : ‘కిందపడ్డా పై చేయి నాదే’ చందంగా వ్యవహరిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. 17 ఏళ్ల బాలుడికి అసిస్టెంట్​ ప్రిసైడింగ్​ ఆఫీసర్​గా నియమించిన ఎస్ఈసీ.. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేసింది. బాలుడిని ఏపీవోగా నియమించలేదని, కేవలం వెబ్ కాస్టింగ్ విభాగంలో నియమించామని చెబుతూనే.. బాలుడి ఏపీవో ఐడీ కార్డును ప్రదర్శించి తన నిర్లక్ష్యాన్ని తానే బయటపెట్టుకుంది. గ్రేటర్​ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో ఎన్నికల […]

Update: 2020-12-03 06:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ‘కిందపడ్డా పై చేయి నాదే’ చందంగా వ్యవహరిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. 17 ఏళ్ల బాలుడికి అసిస్టెంట్​ ప్రిసైడింగ్​ ఆఫీసర్​గా నియమించిన ఎస్ఈసీ.. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేసింది. బాలుడిని ఏపీవోగా నియమించలేదని, కేవలం వెబ్ కాస్టింగ్ విభాగంలో నియమించామని చెబుతూనే.. బాలుడి ఏపీవో ఐడీ కార్డును ప్రదర్శించి తన నిర్లక్ష్యాన్ని తానే బయటపెట్టుకుంది.

గ్రేటర్​ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారధి తప్పులో కాలేశారు. 17 ఏండ్ల బాలుడికి విధులు కేటాయించినట్లు వచ్చిన వార్తలను గురువారం ఆయన ఖండించారు. సదరు బాలుడు వెబ్​ కాస్టింగ్​ కోసం వచ్చారని, దానికోసం నియమించినట్లు ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారధి వెల్లడించారు. కానీ దీనిపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వాస్తవంగా బాల కార్మిక చట్టం ప్రకారం 18 ఏండ్లలోపు వారిని పనుల్లో పెట్టుకోవడం నిషేధం. అది చట్టరీత్యా నేరం. ఒకవేళ విధుల్లో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎన్నికల సంఘం వెబ్​ కాస్టింగ్​ విధుల్లో నియమించిన బాలుడికి 17 ఏండ్లు మాత్రమే. అంటే ఇంటర్​ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు. వెబ్​ కాస్టింగ్​లో సాధారణంగా బీటెక్​ విద్యార్థులను వినియోగించుకుంటారు. గత ఎన్నికల్లో అదే జరిగింది. జేఎన్​టీయూ, నిట్​ విద్యార్థులతో వెబ్​ కాస్టింగ్​ నిర్వహించారు. కానీ ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సంతోష్​నగర్​ సర్కిల్​లోని ఐఎస్​ సదన్​ 38వ వార్డులో 17 ఏండ్ల విద్యార్థికి విధులు అప్పగించారు.

ఏపీఓ పేరిటే కార్డు

గ్రేటర్​ ఎన్నికల్లో వరుణ్​ సాగర్​ను అసిస్టెంట్​ ప్రిసైడింగ్​ ఆఫీసర్​గా నియమించారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎస్​ఈసీ సమర్థించుకుంటూ ఆ వార్తలను ఖండించింది. కేవలం వెబ్​ కాస్టింగ్​ కోసం నియమించామంటూ సదరు బాలుడి ఫొటో, ఐడీ కార్డుతో వివరణ ఇచ్చింది. కానీ ఐడీ కార్డును ఆధారంగా చూపించిన ఎస్​ఈసీ… అసిస్టెంట్​ ప్రిసైడింగ్​ ఆఫీసర్​ అనే ఐడీ కార్డునే కొనసాగించింది. అసిస్టెంట్​ ప్రిసైడింగ్​ ఆఫీసర్​ అనే కార్డుపై వరుణ్​ సాగర్​ పేరును రాసి, స్టూడెంట్​గా పేర్కొంది. కానీ ఏపీఓ అనేచోట కనీసం ఎలాంటి కొట్టివేత మార్కును పెట్టలేదు. తప్పును కప్పిపుచ్చుకునే నేపథ్యంలో మళ్లీ తప్పు చేస్తోందంటూ ఎన్నికల సంఘం మీద విమర్శలు మళ్లీ మొదలయ్యాయి.

Tags:    

Similar News