ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ మరో షాక్..
దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో షాక్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఏపీఎస్ అధికారిని ఎన్నికల విధుల తప్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో సంబంధిత జాయింట్ కలెక్టర్లకు చార్జ్ అప్పగించి విధుల నుంచి రిలీవ్ కావాలని చిత్తూరు, గుంటూరు కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. స్థానిక ఎన్నికల నిర్వహణలో […]
దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో షాక్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఏపీఎస్ అధికారిని ఎన్నికల విధుల తప్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో సంబంధిత జాయింట్ కలెక్టర్లకు చార్జ్ అప్పగించి విధుల నుంచి రిలీవ్ కావాలని చిత్తూరు, గుంటూరు కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు SEC ప్రకటించారు. ఇదిలాఉండగా, ఎన్నికల నిర్వహణను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నిస్తుండగా.. SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎన్నికలను నిర్వహించేందుకు ధృడ నిశ్చయంతో ముందుకు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.