ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌పై ఎస్ఈసీ కసరత్తు

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కౌంటింగ్ ప్రక్రియకు కసరత్తు ప్రారంభించింది. హైకోర్టు తీర్పుకాపీ వచ్చిన వెంటనే దానిపై ఎస్ఈసీ అధ్యయనం చేసిన తర్వాత కౌంటింగ్ నిర్వహణ తేదీల ఖరారుపై ఉన్నతాధికారులతో ఎస్ఈసీ నీలం సాహ్నీ చర్చలు జరుపనున్నారు. సాధ్యమైనంత త్వరగా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ తేదీల ఖరారుపై […]

Update: 2021-09-16 05:02 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కౌంటింగ్ ప్రక్రియకు కసరత్తు ప్రారంభించింది. హైకోర్టు తీర్పుకాపీ వచ్చిన వెంటనే దానిపై ఎస్ఈసీ అధ్యయనం చేసిన తర్వాత కౌంటింగ్ నిర్వహణ తేదీల ఖరారుపై ఉన్నతాధికారులతో ఎస్ఈసీ నీలం సాహ్నీ చర్చలు జరుపనున్నారు. సాధ్యమైనంత త్వరగా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ తేదీల ఖరారుపై డీజీపీ గౌతం సవాంగ్‌తోపాటు ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఎస్ఈసీ నీలం సాహ్ని గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం భేటీ కానున్నారు. కౌంటింగ్ చేపట్టేందుకు కావాల్సిన సిబ్బంది, పటిష్టమైన భద్రతా చర్యలపై సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 18న లేదా 21న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News