ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ ఒప్పందానికి సెబీ ఆమోదం

దిశ, వెబ్‌డెస్క్: ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మధ్య జరిగిన ఒప్పందం విష్యంలో అడ్డంకూ సృష్టిస్తున్న అమెజాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ ఒప్పందాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదించింది. అమెజాన్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. కీలక ఒప్పందాలకు సంబంధించిన వివాదాలు ఉన్నా సరే ముందు తమతో పాటు షేర్ హోల్డర్లకు సమాచారం ఇవ్వాలని సెబీ పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీ దృష్టికి సైతం తీసుకెళ్లాలని కోరింది. అంతేకాకుండా ఈ ఒప్పందం తర్వాత యాజమాన్య […]

Update: 2021-01-21 05:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మధ్య జరిగిన ఒప్పందం విష్యంలో అడ్డంకూ సృష్టిస్తున్న అమెజాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ ఒప్పందాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదించింది. అమెజాన్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. కీలక ఒప్పందాలకు సంబంధించిన వివాదాలు ఉన్నా సరే ముందు తమతో పాటు షేర్ హోల్డర్లకు సమాచారం ఇవ్వాలని సెబీ పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీ దృష్టికి సైతం తీసుకెళ్లాలని కోరింది. అంతేకాకుండా ఈ ఒప్పందం తర్వాత యాజమాన్య మార్పులో న్యాయపరమైన చిక్కులు లేకుండా రూట్‌మ్యాప్ వివరాలను ఇవ్వాలని ఆదేశించింది.

గతేడాది ఆగష్టు 29న ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, కిశోర్ బియానీ ఆధ్వర్యంలోని ఫ్యూచర్ గ్రూప్ మధ్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్ వాటాలను రూ. 24,713 కోట్లతో కొనుగోలు చేసింది. ఈ ఒప్పందాన్ని నవంబర్‌లో సీసీఐ అంగీకరించగా, గురువారం సెబీ ఆమోదం తెలిపింది. అయితే, ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ మధ్య ఒప్పందానికి అభ్యంతరం చెబుతూ అమెజాన్ సింగపూర్ కోర్టుకు వెళ్లింది. ఫ్యూచర్ గ్రూపులోని కూపన్ విభాగంలో అమెజాన్‌కు 49 శాతం వాటా ఉంది. ఈ క్రమంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విక్రయించడమేంటనీ ప్రశ్నించింది. దీనికి సంబంధించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో అమెజాన్ కావాలనే తమ సంస్థ వాటాల విక్రయానికి ఆడుపడుతోందని ఫ్యూచర్ గ్రూప్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సెబీ ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపుతూ ఆమోదముద్ర వేసింది.

Tags:    

Similar News