20 మిలియన్ ఏళ్లైనా.. చెక్కు చెదరని చెట్టు భాగాలు
దిశ, వెబ్‌డెస్క్: సకల జీవరాశికి ఆయువునందిస్తున్న చెట్ల ఆయువు తీరాక అవి మట్టిలో కలిసిపోయి శిలాజ ఇంధనంగా మారిపోతాయని అందరికి తెలిసిన విషయమే. అయితే అగ్నిపర్వత ద్వీపమైన లెస్బోస్‌లో 20 మిలియన్ ఏళ్ల తర్వాత కూడా కొమ్మలు, వేర్లు చెక్కుచెదరకుండా ఉన్న అరుదైన శిలాజ చెట్టును గ్రీకు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. గ్రీస్‌లోని లెస్బోస్ ప్రాంతంలో లక్షలాది ఏళ్ల క్రితం 15,000 హెక్టార్ల విస్తీర్ణంలో పెట్రిఫైడ్ ఫారెస్ట్ ఉండేది. యునెస్కో ప్రొటెక్టెడ్ సైట్ అయిన ఈ ప్రాంతాన్ని […]
దిశ, వెబ్‌డెస్క్: సకల జీవరాశికి ఆయువునందిస్తున్న చెట్ల ఆయువు తీరాక అవి మట్టిలో కలిసిపోయి శిలాజ ఇంధనంగా మారిపోతాయని అందరికి తెలిసిన విషయమే. అయితే అగ్నిపర్వత ద్వీపమైన లెస్బోస్‌లో 20 మిలియన్ ఏళ్ల తర్వాత కూడా కొమ్మలు, వేర్లు చెక్కుచెదరకుండా ఉన్న అరుదైన శిలాజ చెట్టును గ్రీకు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
గ్రీస్‌లోని లెస్బోస్ ప్రాంతంలో లక్షలాది ఏళ్ల క్రితం 15,000 హెక్టార్ల విస్తీర్ణంలో పెట్రిఫైడ్ ఫారెస్ట్ ఉండేది. యునెస్కో ప్రొటెక్టెడ్ సైట్ అయిన ఈ ప్రాంతాన్ని ‘వోల్కానిక్ ఐలాండ్’(అగ్నిపర్వత ద్వీపం)గా పిలుస్తారు. 20 మిలియన్ ఏళ్ల కిందట సంభవించిన అగ్నిపర్వత విస్ఫోటనం ఫలితంగా అడవి మొత్తం నాశనమైంది. లావా వెదజల్లిన బూడిదలో ఆ చెట్లన్ని పూర్తిగా నేలమట్టమైపోయాయి. తాజాగా ఈ పురాతన అడవికి సమీపంలో రోడ్డు పనులు చేపడుతున్న సమయంలో ఓ శిలాజ చెట్టును శాస్త్రవేత్తలు గుర్తించగా, దాని కొమ్మలు, వేర్లు ఇప్పటికీ చెక్కుచెదరకపోవడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. 19 మీటర్ల పొడవున్న ఆ చెట్టు కూలిపోవడంతో, ఇన్నేళ్లుగా అగ్నిపర్వత బూడిదలో పూర్తిగా భద్రపరచబడింది.
‘ఇదో యూనిక్ ఫైండ్. శిలాజ కలపను అధ్యయనం చేయడం ద్వారా అది ఏ రకానికి చెందిన మొక్కనో గుర్తిస్తాం. దీంతో పాటు అదే ప్రదేశంలో పెద్ద సంఖ్యలో పండ్ల చెట్ల ఆకులు, జంతువుల ఎముకలను కనుగొన్నాం. లెస్బోస్‌లో 17 నుంచి 20 మిలియన్ ఏళ్ల కిందట ఉన్న వివిధ అడవులు తవ్వకాలలో వెలికి వస్తున్నాయి, ఆ కాలంలో ఉన్న పర్యావరణ వ్యవస్థను మేము పునర్నిర్మించగలం’ అని మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ఆఫ్ ది పెట్రిఫైడ్ ఫారెస్ట్ ఆఫ్ లెస్బోస్ ప్రొఫెసర్ జూరోస్ చెప్పారు.