లావాపై వంట చేసుకున్న శాస్త్రవేత్తలు

దిశ, ఫీచర్స్ : ఐస్‌లాండ్ రాజధాని రెక్‌జావిక్‌కు సమీపంలో ఉన్న ‘ఫగ్రడాల్ ఫై జాల్’ అనే అగ్నిపర్వతం ఇటీవలే బద్దలైన విషయం తెలిసిందే. ఈ పర్వతం 800 ఏళ్లలో తొలిసారిగా విస్ఫోటన చెందడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా అగ్నిపర్వతం నుంచి లావా బయటకు రావడాన్ని డ్రోన్‌తో చిత్రీకరించిన స్టెయిన్‌బెక్ అనే బ్లాగర్.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఈ అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు సమీప ప్రాంతంలో కొన్ని వేలసార్లు(దాదాపు […]

Update: 2021-03-25 03:56 GMT

దిశ, ఫీచర్స్ : ఐస్‌లాండ్ రాజధాని రెక్‌జావిక్‌కు సమీపంలో ఉన్న ‘ఫగ్రడాల్ ఫై జాల్’ అనే అగ్నిపర్వతం ఇటీవలే బద్దలైన విషయం తెలిసిందే. ఈ పర్వతం 800 ఏళ్లలో తొలిసారిగా విస్ఫోటన చెందడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా అగ్నిపర్వతం నుంచి లావా బయటకు రావడాన్ని డ్రోన్‌తో చిత్రీకరించిన స్టెయిన్‌బెక్ అనే బ్లాగర్.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఈ అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు సమీప ప్రాంతంలో కొన్ని వేలసార్లు(దాదాపు యాభైవేలు) చిన్న చిన్న భూకంపాలు సంభవించాయి. ఈ విషయాలపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు.. ఈ క్రమంలో అక్కడ వంట చేయడం విశేషం. ప్రస్తుతం ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

బార్‌బేక్యూ, బొగ్గులు లేకుండా ‘సాసేజ్ ప్రిపేర్(ఉడికించడం)’ చేయడం సాధ్యమవుతుందా? అంటే కచ్చితంగా ఇట్స్ ఇంపాజిబుల్ అంటారు. కానీ ఐస్‌లాండ్‌‌లో అగ్నిపర్వత విస్ఫోటనంపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త మాత్రం.. వాటి(బార్‌బేక్యూ, బొగ్గు) అవసరం లేకుండా లావాను ఉపయోగించి ఈజీగా చేసేయొచ్చని చెబుతున్నాడు. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా విస్పోటనం వల్ల వెలువడిన వేడి వేడి లావాపై హాట్ డాగ్స్ చేశారు. శాండ్‌విచ్‌లను గ్రిల్ చేయడంతో పాటు లావా మీద పాన్‌ పెట్టి ఆమ్లెట్‌ వేశారు. ఓ వైపు అగ్నిపర్వతం నుంచి లావా ఎగజిమ్ముతుంటే.. ఆ బ్యాక్‌గ్రౌండ్‌ నేపథ్యంలో శాస్త్రవేత్తలు తాము చేసుకున్న స్నాక్స్ హ్యాపీగా తినడం విశేషం. వీటికి సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవుతుండగా, అందులో ఓ వీడియోకు ‘లావా హాట్ డాగ్స్‌ను ఆస్వాదించడానికి ఐస్‌లాండ్ అగ్నిపర్వత విస్పోటనం అవకాశం కల్పించింది’ అనే క్యాప్షన్ జత చేశారు. కానీ లావా మీద చేసిన ఆహారం తీసుకోవడం సురక్షితమేనా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దీనిపై నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. ‘నా జీవిత లక్ష్యం మారిపోయింది. లావా మీద హాట్ డాగ్ కుక్ చేయడమే నా ముందున్న టార్గెట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ప్రాంతంలో నో-ఫ్లై జోన్ ఆంక్షలు విధించడంతో, ప్రజలెవరూ ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనుమతి లేకుండా పోయింది.

Tags:    

Similar News