జులై 27 నుంచి స్కూల్స్ పున:ప్రారంభం..
దిశ, వెబ్‌డెస్క్: అన్‌లాక్ 2.0 మొదలు కావడంతో దేశ వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు ఎప్పుడు తెరవనున్నారన్న అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.ఈ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడిలోకి వస్తే తప్ప పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను పున:ప్రారంభించే అవకాశం లేదు.కాగా, జులై 27 నుంచి స్కూల్స్‌ను పున:ప్రారంభించే యోచనలో ఉన్నట్లు హర్యానా విద్యాశాఖ సూత్రప్రాయంగా వెల్లడించింది. జులై 1 నుంచి 26 తేదీ వరకు వేసవి సెలవులుగా […]
దిశ, వెబ్‌డెస్క్: అన్‌లాక్ 2.0 మొదలు కావడంతో దేశ వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు ఎప్పుడు తెరవనున్నారన్న అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.ఈ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడిలోకి వస్తే తప్ప పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను పున:ప్రారంభించే అవకాశం లేదు.కాగా, జులై 27 నుంచి స్కూల్స్‌ను పున:ప్రారంభించే యోచనలో ఉన్నట్లు హర్యానా విద్యాశాఖ సూత్రప్రాయంగా వెల్లడించింది. జులై 1 నుంచి 26 తేదీ వరకు వేసవి సెలవులుగా ఓ అధికారిక ప్రకటనలో హర్యానా విద్యా శాఖ పేర్కొంది. తద్వారా జులై 27 నుంచి స్కూళ్లను పున: ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే కాలేజీలు, యూనివర్సిటీలు మాత్రం ఆగస్టు వరకు మూసే ఉంచనున్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ఇతర సంబంధిత అధికారులతో చర్చించిన తర్వాతే కాలేజీలు పున:ప్రారంభించే విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు హర్యానా విద్యా శాఖ అధికారులు తెలిపారు. అదే సమయంలో ఆన్‌లైన్ విద్యావిధానాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపింది.
హర్యానాలో స్కూళ్లు, కాలేజీల పున:ప్రారంభానికి సంబంధించి హర్యానా విద్యాశాఖ మంత్రి కన్వర్ పాల్ గుజ్జర్ ఇది వరకే కీలక వ్యాఖ్యలు చేశారు. జులై మాసంలోనే స్కూళ్లను విడతల వారీగా పున:ప్రారంభిస్తామని.. కాలేజీలు, యూనివర్సిటీలను ఆగస్టు మాసంలో తెరవనున్నట్లు చెప్పారు.