స్కూళ్ల ప్రారంభంపై సీఎం జగన్‌ కీలక నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ల పున ప్రారంభంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 2నుంచి తరగతులను ప్రారంభించాలని స్పష్టం చేశారు. రెండురోజులకు ఓసారి తరగతులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 1,3,5,7 తరగతులకు ఒకరోజు క్లాసులు, 2,4,6,8 తరగతుల విద్యార్థులకు మరో రోజు క్లాసులు నిర్వహించనున్నారు. విద్యార్థుల సంఖ్య 750కంటే ఎక్కువగా ఉంటే మూడ్రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. నవంబర్‌లో మొత్తం ఒంటిపూట బడులే నిర్వహించి, మధ్యాహ్న భోజన పథకం అమలు […]

Update: 2020-10-20 06:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ల పున ప్రారంభంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 2నుంచి తరగతులను ప్రారంభించాలని స్పష్టం చేశారు. రెండురోజులకు ఓసారి తరగతులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 1,3,5,7 తరగతులకు ఒకరోజు క్లాసులు, 2,4,6,8 తరగతుల విద్యార్థులకు మరో రోజు క్లాసులు నిర్వహించనున్నారు. విద్యార్థుల సంఖ్య 750కంటే ఎక్కువగా ఉంటే మూడ్రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. నవంబర్‌లో మొత్తం ఒంటిపూట బడులే నిర్వహించి, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే ఆన్‌లైన్‌ క్లాసులకు ఏర్పాట్లు చేయాలన్నారు. పరిస్థితిని బట్టి పాఠశాలల వేళలపై డిసెంబర్‌లో నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News