ఏపీలో ఆగస్టు 16 నుంచి తెరుచుకోనున్న స్కూల్స్

దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పున: ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. అయితే ఈలోగా జూలై 12 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖలో నాడు- నేడుపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని వివరించారు. […]

Update: 2021-07-07 03:42 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పున: ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. అయితే ఈలోగా జూలై 12 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖలో నాడు- నేడుపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని వివరించారు. జూలై 15 నుంచి ఆగస్టు 15వరకు వర్క్ బుక్కులపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పాఠశాలల్లో నాణ్య మైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం ఈ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం నూతన విద్యా విధానం తప్పనిసరిగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. నూతన విద్యా విధానం అమలు వల్ల ఏ స్కూల్ మూతపడదని అలాగే ఏ ఉపాధ్యాయుడు పోస్టుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. రాబోయే రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నాడు నేడు కింద పనుల కోసం 16 వేల కోట్లతో బడ్జెట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. 30శాతం పదోతరగతి, 70 శాతం ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు ప్రాతిపదికగా ఇంటర్ విద్యార్థులకు మార్కుల కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరు లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

Tags:    

Similar News