‘కింగ్ అండ్ క్వీన్’ ఇద్దరూ అమ్మాయిలే.. అదెలా?

దిశ, ఫీచర్స్ : మోస్ట్ ప్రామిసింగ్ కింగ్ అండ్ క్వీన్ అవార్డు.. అంటే ఒక మగ, ఒక ఆడ ఈ గౌరవాన్ని పొందాలి. అది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం. కానీ యూఎస్‌‌లోని ఓ స్కూల్ ఈ ట్రెడిషన్‌ను బ్రేక్ చేసింది. కపుల్ అంటే ఆడ, మగ అనే ఎందుకు అనుకోవాలి? ఇద్దరు మహిళలు సహజీవనం చేయడం లేదా? ఇద్దరు పురుషులు కలిసి జీవించడం లేదా? వారిద్దరు కూడా జంటే కదా! అనే అభిప్రాయంతో ఓ సంచలన […]

Update: 2021-05-05 07:33 GMT

దిశ, ఫీచర్స్ : మోస్ట్ ప్రామిసింగ్ కింగ్ అండ్ క్వీన్ అవార్డు.. అంటే ఒక మగ, ఒక ఆడ ఈ గౌరవాన్ని పొందాలి. అది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం. కానీ యూఎస్‌‌లోని ఓ స్కూల్ ఈ ట్రెడిషన్‌ను బ్రేక్ చేసింది. కపుల్ అంటే ఆడ, మగ అనే ఎందుకు అనుకోవాలి? ఇద్దరు మహిళలు సహజీవనం చేయడం లేదా? ఇద్దరు పురుషులు కలిసి జీవించడం లేదా? వారిద్దరు కూడా జంటే కదా! అనే అభిప్రాయంతో ఓ సంచలన నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలిచింది. ప్రతీ ఏడాది తమ స్కూల్ పిల్లలకు అందించే మోస్ట్ ప్రామిసింగ్ ‘కింగ్ అండ్ క్వీన్’ అవార్డును ఈ సారి ఒక అమ్మాయి, అబ్బాయికి కాకుండా ఇద్దరు లెస్బియన్స్‌కు అందించి హిస్టరీ క్రియేట్ చేసింది.

అన్నీ వైజ్, రిలే లౌడర్‌మిల్క్.. యంగ్ లెస్బియన్ కపుల్. యూఎస్, ఓహియోలోని కింగ్స్ లోకల్ స్కూల్ డిస్ట్రిక్ట్‌కు చెందిన వీరు ఆరు నెలల పాటు డేటింగ్ కూడా చేశారు. వీరిద్దరి అన్యోన్యతకు ఫిదా అయిపోయిన స్కూల్ యాజమాన్యం, పిల్లలు.. ఇందుకు ప్రతిఫలంగా ఆ జంటను చరిత్రలో నిలిపారు. ప్రతీ అకాడమిక్ ఇయర్ ఎండింగ్‌లో అందించే ‘మోస్ట్ ప్రామిసింగ్ కింగ్ అండ్ క్వీన్’ గౌరవాన్ని ఈ ఇద్దరికి అందిస్తూ గౌరవించారు. ఈ పిక్చర్‌ను ఫేస్‌బుక్‌ పేజీలో షేర్ చేసిన స్కూల్ యాజమాన్యం కంగ్రాట్స్ చెప్పగా.. అది కాస్త వైరల్ అయిపోయింది. 4.8k లైక్స్, 2.4k కామెంట్స్‌‌తో ట్రెండింగ్‌లో ఉన్న పోస్ట్‌పై మిక్స్‌డ్ కామెంట్స్ వచ్చాయి. అయినా సరే తాము తీసుకున్న నిర్ణయాన్ని పాజిటివ్ వేలో సమర్థించుకున్న స్కూల్.. తమ స్టూడెంట్స్ ఇద్దరికీ ఓటు వేసి ‘కింగ్ అండ్ క్వీన్‌’గా గెలిపించడం విశేషమని యాజమాన్యం వివరణ ఇస్తోంది. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీని తమ పిల్లలు పాజిటివ్‌గా చూడడం, వారిని సపోర్ట్ చేయడం నిజంగా ఆనందంగా ఉందని.. కనీసం ఈ జనరేషన్‌తో అయినా ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీపై చిన్నచూపు తగ్గుతుందని, వారికి సమాజంలో గౌరవం దక్కుతుందని ఆశిస్తున్నామని వెల్లడించారు.

ఇక18 ఏళ్ల లెస్బియన్ కపుల్ ఆన్నీ, రిలే కూడా ఇలాంటి గౌరవం దక్కుతుందని అనుకోలేదని చెప్తున్నారు. ఎల్‌జీబీటీక్యూ కపుల్‌ ఇలా కూడా హానర్ పొందవచ్చని, ప్రజలకు అర్థమయ్యేందుకు సహాయపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. తమ ఎమోషన్స్ గురించి లోలోపల బాధపడుతున్న హోమోసెక్సువల్ పీపుల్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

అయితే స్కూల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు తల్లిదండ్రులు తప్పుపట్టారు. స్కూల్ మీటింగ్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ‘మోస్ట్ ప్రామిసింగ్ కింగ్ అండ్ క్వీన్’ అంటే కింగ్- మేల్, క్వీన్ – ఫిమేల్ అయి ఉండాలని, ఇలా లెస్బియన్స్‌కు అవార్డు ఇవ్వడం ఏంటని ఫైర్ అయ్యారు.

 

Tags:    

Similar News