నీటిలో తేలే ఏటీఎమ్.. ఎక్కడంటే ?
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శ్రీనగర్‌లోని దాల్ సరస్సుపై ఫ్లోటింగ్ ఏటీఎమ్‌ను ప్రారంభించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పర్యాటకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిలో తేలే ఏటీఎమ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 16న ఈ ఫ్లోటింగ్ ఏటీఎమ్‌ను ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు. పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉండే శ్రీనగర్‌లో మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు ఎస్‌బీఐ ఈ ఫ్లోటింగ్ ఏటీఎంను […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శ్రీనగర్‌లోని దాల్ సరస్సుపై ఫ్లోటింగ్ ఏటీఎమ్‌ను ప్రారంభించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పర్యాటకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిలో తేలే ఏటీఎమ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 16న ఈ ఫ్లోటింగ్ ఏటీఎమ్‌ను ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు.
పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉండే శ్రీనగర్‌లో మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు ఎస్‌బీఐ ఈ ఫ్లోటింగ్ ఏటీఎంను తీసుకొచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. దాల్ సరస్సులోని హౌస్‌బోట్‌లో ఈ ఏటీఎం ఉందని, ప్రజలు ఎప్పటినుంచో దీనికోసం ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు. దాల్ సరస్సుపై ఇప్పటికే నీటిలో తేలియాడే కూరగాయల మార్కెట్, పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి. కాగా, భారత్‌లో మొట్ట మొదటిసారిగా కొచ్చిలో ఫ్లోటింగ్ ఏటీఎంను ఎస్‌బీఐ ఏర్పాటు చేసింది.