షారుఖ్‌కు చురకలంటించిన సయానీ..

దిశ, వెబ్‌డెస్క్ : ‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు’ అని గాంధీ మహాత్ముడు ఏనాడో చెప్పాడు. ఆయన మాటలు భావితరాలకు మార్గదర్శకాలు అని మనం కూడా తరచూ వింటూనే ఉంటాం. ఈ క్రమంలోనే గాంధీ జయంతి సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.. పిల్లలను ఉద్దేశించి గాంధీజీ చెప్పిన సూక్తులు కోట్ చేశాడు. అయితే, దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. నటి […]

Update: 2020-10-04 05:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు’ అని గాంధీ మహాత్ముడు ఏనాడో చెప్పాడు. ఆయన మాటలు భావితరాలకు మార్గదర్శకాలు అని మనం కూడా తరచూ వింటూనే ఉంటాం. ఈ క్రమంలోనే గాంధీ జయంతి సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.. పిల్లలను ఉద్దేశించి గాంధీజీ చెప్పిన సూక్తులు కోట్ చేశాడు. అయితే, దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. నటి సయానీ గుప్తా షారుఖ్ మాటలను ఉద్దేశించి విమర్శలు చేసింది.

చెడు, మంచి.. ఏ సమయంలోనైనా పిల్లలు గాంధీజీ చెప్పిన ‘చెడు మాట్లాడకూడదు.. చెడు వినకూడదు.. చెడు చూడకూడదు’ అనే సూక్తిని ఫాలో కావాలంటూ షారుఖ్ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపాడు. దానికి సయామీ స్పందిస్తూ.. ‘పిల్లలకు మంచి విషయాలు బోధించమని గాంధీ గారు చెప్పారు. అదే విధంగా, నిజం నిర్భయంగా మాట్లాడాలని కూడా చెప్పారు. ఇబ్బందులు, వివక్షను ఎదుర్కొంటున్న దళితుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కళ్లను, నోటిని మూసుకోకండి.. సత్యం, ధర్మం కోసం మాట్లాడండి’ అంటూ షారుఖ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది సయానీ. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజమే అందరూ నోరు మూసుకుని కూర్చుంటే వాస్తవాలు మరుగనపడిపోతాయని, నిజాలు చరిత్రలో కలిసిపోతాయని, సెలెబ్రిటీలు ఇలాంటి సమయంలో బాధ్యతాయుతంగా ముందుకొచ్చి.. బాధితులకు అండగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News