హజ్ యాత్ర.. నిబంధనలు ఇవే

దిశ, వెబ్‌డెస్క్: హజ్ యాత్రకు ప్రతియేడు మన దేశం నుంచి చాలా మంది వెళుతుంటారు. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు తమ భూభాగంలోనికి ఇతర దేశస్థులను అనుమతించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం భారత్ లోనూ కరోనా కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో ఉండటం.. ఏటా వేల సంఖ్యలో మనదేశం నుంచి ముస్లిములు హజ్ యాత్రకు వెళుతుండటంతో సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ సారి హాజ్ యాత్రకు అతి తక్కువ మందిని […]

Update: 2020-07-08 10:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: హజ్ యాత్రకు ప్రతియేడు మన దేశం నుంచి చాలా మంది వెళుతుంటారు. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు తమ భూభాగంలోనికి ఇతర దేశస్థులను అనుమతించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం భారత్ లోనూ కరోనా కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో ఉండటం.. ఏటా వేల సంఖ్యలో మనదేశం నుంచి ముస్లిములు హజ్ యాత్రకు వెళుతుండటంతో సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ సారి హాజ్ యాత్రకు అతి తక్కువ మందిని మాత్రమే అనుమతిస్తోంది. ప్రతి ఏడాది ఈ యాత్రకు రెండు లక్షల మందికి పైగా హాజరవుతుంటారు. అయితే, ఈ ఏడాది కేవలం 10వేల మందికి మాత్రమే అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది.

అంతేకాకుండా, ఈ యాత్రకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. మక్కాలోని జామ్ జామ్ బావి నుంచి భక్తులు స్వీకరించే పవిత్ర జలాన్ని ఈసారి ప్లాస్టిక్ బాటిళ్లలో ఇవ్వనున్నారు. అదే విధంగా కాబాలో విసిరే గులక రాళ్లను ముందుగానే స్టెరిలైజ్ చేసి సంచుల్లో ఉంచి యాత్రకు వచ్చే భక్తులకు ఇవ్వనున్నారు. అయితే, ఈసారి కాబాలో ఉన్న నల్లని రాయిని యాత్రికులు ఎవరూ ముట్టుకోవడానికి వీలులేకుండా, కట్టడం చుట్టూ పెద్ద బ్యారియర్లను ఏర్పాటు చేశారు. మసీదులో ఉండే మొత్తం కార్పెట్లను కూడా తొలగించారు. దీంతో మక్కాలోకి వచ్చే యాత్రికులు సొంతంగా రగ్గులు తెచ్చుకోవాల్సి ఉండగా, యాత్రికులకు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే మక్కా యాత్రను పూర్తి చేసుకొని వెళ్లాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News