‘కశ్మీర్’పై పాకిస్థాన్ కుట్రలు విఫలం
పాకిస్థాన్‌కు మరో పరాభవం ఎదురైంది. భారత్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలను కూడగట్టేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కశ్మీర్ అంశంపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్స్ కౌన్సిల్ (ఓఐసీ) విదేశాంగ మంత్రులు(సీఎఫ్‌ఎం) సమావేశం కావాలని పాకిస్థాన్ కోరింది. ఇందుకు సౌదీఅరేబియా ప్రభుత్వం నిరాకరించింది. సీఎఫ్‌సీ సమావేశం ద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచుదామని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఇటీవల మలేషియా పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ […]
పాకిస్థాన్‌కు మరో పరాభవం ఎదురైంది. భారత్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలను కూడగట్టేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కశ్మీర్ అంశంపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్స్ కౌన్సిల్ (ఓఐసీ) విదేశాంగ మంత్రులు(సీఎఫ్‌ఎం) సమావేశం కావాలని పాకిస్థాన్ కోరింది. ఇందుకు సౌదీఅరేబియా ప్రభుత్వం నిరాకరించింది. సీఎఫ్‌సీ సమావేశం ద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచుదామని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఇటీవల మలేషియా పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడా కశ్మీ్ర్ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై 57 ముస్లిం దేశాల కూటమి స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్టులో జమ్ముకశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తిని భారత్ రద్దు చేసింది. అప్పటి నుంచీ ఓఐసీ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం పాకిస్థాన్ ఒత్తిడి తెస్తోంది. ఈ విషయమై ఆ దేశ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు. సీఎఫ్ఎం సమావేశం ద్వారా కశ్మీర్ సమస్యపై భారత్‌కు ఓ విస్పష్టమైన సందేశం పంపించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఓఐసీలో సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలదే పైచేయి. అందులో ఏదైనా ముఖ్యమైన తీర్మానం చేయాలంటే ఈ దేశాల మద్దతు అవసరం. సీఎఫ్ఎం సమావేశానికి సౌదీ అరేబియా తిరస్కరించడంతో పాకిస్థాన్ ఆశలు అడియాశలయ్యాయి.