ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం.. మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్, సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన దుర్ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు జరిగితే దోషులను అత్యంత కఠినంగా శిక్షించాలని, వీటిని చూసిన తర్వాత ఇలాంటివి చేసేందుకు భయం కలగాలని అధికారులను గురువారం ఆదేశించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి దోషులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా తక్షణ చర్యలు చేపట్టాలని […]

Update: 2021-09-10 00:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్, సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన దుర్ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు జరిగితే దోషులను అత్యంత కఠినంగా శిక్షించాలని, వీటిని చూసిన తర్వాత ఇలాంటివి చేసేందుకు భయం కలగాలని అధికారులను గురువారం ఆదేశించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి దోషులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా తక్షణ చర్యలు చేపట్టాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కమిషనర్ దివ్య దేవరాజన్, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తో మాట్లాడి ఆదేశాలిచ్చారు. ఆ బాలిక కుటుంబాన్ని(బాలిక తల్లిదండ్రులు సబావత్ రాజు, జ్యోతి) ఆదుకునేందుకు వెంటనే పోక్సో చట్టం కింద రూ.50 వేలు అందించాలని ఆదేశించారు.

చిన్నారిని అత్యాచారం చేసి, హత్య చేసిన వారి వివరాలు తెలపాలని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, పోలీస్ కమిషనర్ మంత్రికి వివరించారు. బాలిక కుటుంబాన్ని ఆదుకునేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు రూ.50 వేల చెక్ ను కుటుంబానికి అందించనున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ వెల్లడించారు. సీఎం కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో మహిళలు, బాలికల రక్షణకు షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సఖీ కేంద్రాలు పెట్టి భద్రత కల్పిస్తుండగా.. అక్కడక్కడా ఇలాంటి ఘటనలు జరగడం తల్లిదండ్రుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని, ఇలాంటి దుర్మార్గాలను ఉక్కుపాదంతో అణచివేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు.

Tags:    

Similar News