గాంధీ జయంతికి వెళ్లిన సర్పంచ్.. అంతలోనే

దిశ, అచ్చంపేట : రోడ్డు ప్రమాదంలో గ్రామసర్పంచ్ మరణించిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల అచ్చంపేట మండలం మన్నె వారి పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మన్య వారి పల్లి గ్రామ సర్పంచ్ అచ్చంపేట పట్టణంలో నివాసం ఉంటున్నాడని, ప్రతిరోజు తన సొంత గ్రామానికి వెళ్లి వస్తున్నాడని, శనివారం గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని అనంతరం గ్రామ సభ నిర్వహించాలని […]

Update: 2021-10-02 22:31 GMT

దిశ, అచ్చంపేట : రోడ్డు ప్రమాదంలో గ్రామసర్పంచ్ మరణించిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల అచ్చంపేట మండలం మన్నె వారి పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మన్య వారి పల్లి గ్రామ సర్పంచ్ అచ్చంపేట పట్టణంలో నివాసం ఉంటున్నాడని, ప్రతిరోజు తన సొంత గ్రామానికి వెళ్లి వస్తున్నాడని, శనివారం గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని అనంతరం గ్రామ సభ నిర్వహించాలని తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ గ్రామంలోనే ఉన్నాడని, తదుపరి తిరిగి అచ్చంపేటకు ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లాడని తెలిపారు.

ఈ క్రమంలో అచ్చంపేట ప్రధాన రహదారి పై రంగాపూర్ సమీపంలో బైక్‌పై వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడ్డాడని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో బాధితుడి తల వెనుక భాగంలో బలమైన గాయం అయిందని, అటుగా వెళుతున్న ప్రయాణికులు గమనించి బంధువులకు, 108కు సమాచారం అందించారని తెలిపారు. క్షతగాత్రుడుని 108 వాహనంలో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారని, పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించామని తెలిపారు. హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున సర్పంచ్ మూడవత్ సోమ్లా నాయక్( 48) వ్యక్తి మరణించారని బంధువులు తెలిపారు. మృతుడికి భార్య ధనమ్మ కూతురు ఉన్నారు. ఈ ప్రమాదంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

గ్రామంలో విషాదఛాయలు…

మృతుడు మూడవత్ సోమ్లా నాయక్ ప్రమాదవశాత్తు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామం తో పాటు అందరితో సోమ్లా నాయక్ కలుపుగోలుగా ఉండేవాడని తన మరణ వార్త విన్న చాలా మంది విచారం వ్యక్తం చేశారు.

 

Tags:    

Similar News