గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

దిశ, అచ్చంపేట : టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు అభివృద్ధి పనులు చేయుటకు అప్పులు చేసి, చేసిన అప్పులు తీర్చలేక పడరాని పాట్లు పడుతూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎదురవుతుందని నియోజకవర్గంలో చర్చ కొనసాగుతుంది. అలాంటి సంఘటనే నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఉప్పునుంతల మండలం కంసానిపల్లి తండాకు చెందిన అధికార పార్టీ సర్పంచ్ మనెమ్మ భర్త రవి నాయక్ బుధవారం సాయంత్రం అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన […]

Update: 2021-09-10 00:58 GMT

దిశ, అచ్చంపేట : టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు అభివృద్ధి పనులు చేయుటకు అప్పులు చేసి, చేసిన అప్పులు తీర్చలేక పడరాని పాట్లు పడుతూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎదురవుతుందని నియోజకవర్గంలో చర్చ కొనసాగుతుంది. అలాంటి సంఘటనే నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఉప్పునుంతల మండలం కంసానిపల్లి తండాకు చెందిన అధికార పార్టీ సర్పంచ్ మనెమ్మ భర్త రవి నాయక్ బుధవారం సాయంత్రం అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం సర్పంచుల పై ఉక్కుపాదం మోపుతూ చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వకుండా ఎలాగైనా గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆంక్షలు విధిస్తూ కాస్త నిర్లక్ష్యం చేసిన సర్పంచులపై సస్పెండ్ వేటు వేసుకున్నా సందర్భాలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి.

నా భర్త ఆత్మహత్య యత్నం…

గ్రామంలో స్మశాన వాటిక నిర్మాణం, రైతు వేదిక, ఉద్యానవనాలు, డంపింగ్ యార్డ్ నిర్మాణానికి సుమారు ఎనిమిది లక్షలకు పైగా అప్పులు చేసి పనులు చేపట్టామని సర్పంచ్ బాలమ్మ వాపోయింది. తెచ్చిన అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక, అప్పులిచ్చిన ఆసాములు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తూ బజార్లో పంచాయతీ పెడతాం పెద్దల వద్దకు లాగుదామని, మాటలు అంటూ మనోవేదనకు గురిచేయడంతో చేసేదిలేక నా భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాదులోని బీఎన్ రెడ్డి‌నగర్‌లో గల మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపింది.

పరామర్శించిన దేవుని సతీష్ మాదిగ…

అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న రవి నాయక్‌ను గురువారం ఆస్పత్రిలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవుని సతీష్ మాదిగ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లకు మెరుగైన వైద్యం చేయాలని సూచించామని ఆయన తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సర్పంచులకు అండగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు.

తప్పులతోనే…

గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు మూలంగానే అప్పుల భారం పెరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులను తీర్చలేక నే పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, ఇప్పటికైనా వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పరామర్శించిన ఎమ్మెల్యే…

పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సర్పంచ్‌ను గురువారం రాత్రి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బాధితులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ బాధితుడికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, ఖర్చుకు వెనకాడకుండా వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు.

Tags:    

Similar News