కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
దిశ,వెబ్ డెస్క్: సరూర్ నగర్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సరూర్ నగర్‌లో మొక్క జొన్న వ్యాపారి నాగభూషణంను అజీజ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసినట్టు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని ఆయన చెప్పారు. ఈ కిడ్నాప్‌నకు రాజ్ భూషణ్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి అని ఆయన వెల్లడించారు. రైతుల నుంచి రాజ్ భూషణ్ పెద్ద ఎత్తున మొక్క జొన్నలు కొన్నాడని తెలిపారు. వాటిని నాగభూషణానికి అతను […]
దిశ,వెబ్ డెస్క్: సరూర్ నగర్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సరూర్ నగర్‌లో మొక్క జొన్న వ్యాపారి నాగభూషణంను అజీజ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసినట్టు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని ఆయన చెప్పారు. ఈ కిడ్నాప్‌నకు రాజ్ భూషణ్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి అని ఆయన వెల్లడించారు. రైతుల నుంచి రాజ్ భూషణ్ పెద్ద ఎత్తున మొక్క జొన్నలు కొన్నాడని తెలిపారు. వాటిని నాగభూషణానికి అతను అమ్మినట్టు సీపీ తెలిపారు. ఈ లావాదేవిల కింద రాజ్ భూషణ్ కు నాగ భూషణం 2కోట్ల80 లక్షలు ఇవ్వాల్సిఉందని తెలిపారు. కాగా చాలా సార్లు అడిగినప్పటికీ నాగభూషణం పైసలు చెల్లించలేదని చెప్పారు. దీంతో నాగభూషణంను కిడ్నాప్ చేయాలని రాజ్ భూషణ్ ప్లాన్ చేశాడు. అజీజ్ గ్యాంగ్ కు రూ.10 లక్షల సుపారీ ఇచ్చి నాగభూషణాన్ని కిడ్నాప్ చేయించాడు. కాగా గ్యాంగ్ కు చెందిన అబ్దుల్ అజీజ్, సునీల్ పాటిల్, నిఖిల్ సింగ్, రాజేష్ లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ప్రధాన నిందితుడు రాజ్ భూషణ్ పరారీలో ఉన్నారని ఆయన వెల్లడించారు.