అందుకే ధోని ఫేర్ వెల్ మ్యాచ్ ఆడలేదు

దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తనకు చివరిదని న్యూజీలాండ్ కీపర్ జేబీ వాట్లింగ్ పేర్కొన్న తర్వాత అతడిని సగర్వంగా జట్టు వీడ్కోలు పంపించింది. సచిన్, సంగక్కర, కుంబ్లే వంటి ఎంతో మంది దిగ్గజాలు తమ చివరి మ్యాచ్ తర్వాత సగర్వంగా మైదానాన్ని వీడారు. ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీకి చెందిన మూడు ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్, టీమ్ ఇండియాకు విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ధోని మాత్రం తన వీడ్కోలు మ్యాచ్ ఆడలేదు. కనీసం ఈ […]

Update: 2021-06-30 11:25 GMT

దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తనకు చివరిదని న్యూజీలాండ్ కీపర్ జేబీ వాట్లింగ్ పేర్కొన్న తర్వాత అతడిని సగర్వంగా జట్టు వీడ్కోలు పంపించింది. సచిన్, సంగక్కర, కుంబ్లే వంటి ఎంతో మంది దిగ్గజాలు తమ చివరి మ్యాచ్ తర్వాత సగర్వంగా మైదానాన్ని వీడారు. ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీకి చెందిన మూడు ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్, టీమ్ ఇండియాకు విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ధోని మాత్రం తన వీడ్కోలు మ్యాచ్ ఆడలేదు. కనీసం ఈ మ్యాచ్ ఆడి రిటైర్ అవుతానని కూడా చెప్పలేదు. గత ఏడాది ఐపీఎల్ ముందు అర్దాంతరంగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. అంత అకస్మాత్తుగా ఎందుకు క్రికెట్‌ను వదిలేశాడని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా. దీనికి అసలు కారణాన్ని మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్‌సింగ్ వెల్లడించారు. ‘గత ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరిగి ఉంటే.. అందులో ఆడి తన కెరీర్ గుడ్‌బై చెబుతామని అనుకున్నాడు. అయితే కరోనా కారణంగా ఆ టోర్నీ రద్దయ్యింది. మరోవైపు ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ అక్టోబర్-నవంబర్‌కు వాయిదా పడింది. అన్ని రోజులు తన ఫిట్‌నెస్ కాపాడు కోవడం కష్టమని భావించే ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు’ అని శరణ్‌దీప్ చెప్పాడు.

Tags:    

Similar News