సంజనా సంఘీ.. ‘టీచ్ ఫర్ ఇండియా’

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రెట్టీ హీరోయిన్ సంజనా సంఘీ.. ‘టీచ్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొంది. ప్రస్తుత విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న ‘టీచ్ ఫర్ ఇండియా’ ఆర్గనైజేషన్‌తో కలిసి వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజనా.. తరగతి గదులు చేంజ్ మేకర్స్‌ను ఎలా తయారు చేస్తాయనే అంశంపై చర్చించింది. టీచ్ ఫర్ ఇండియా ద్వారా విద్యనభ్యసిస్తున్న పిల్లలకు పాఠాలు బోధించిన ఈ ‘దిల్ బెచారా’ హీరోయిన్.. మీరు కూడా వాలంటీర్స్‌గా చేరి విద్యార్థులకు సహకరించాలని.. దేశాన్ని మరింత […]

Update: 2020-09-23 01:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రెట్టీ హీరోయిన్ సంజనా సంఘీ.. ‘టీచ్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొంది. ప్రస్తుత విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న ‘టీచ్ ఫర్ ఇండియా’ ఆర్గనైజేషన్‌తో కలిసి వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజనా.. తరగతి గదులు చేంజ్ మేకర్స్‌ను ఎలా తయారు చేస్తాయనే అంశంపై చర్చించింది. టీచ్ ఫర్ ఇండియా ద్వారా విద్యనభ్యసిస్తున్న పిల్లలకు పాఠాలు బోధించిన ఈ ‘దిల్ బెచారా’ హీరోయిన్.. మీరు కూడా వాలంటీర్స్‌గా చేరి విద్యార్థులకు సహకరించాలని.. దేశాన్ని మరింత మెరుగైన విద్యా భారత్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అభిమానులకు పిలుపునిచ్చింది.

ప్రస్తుతం కరోనా కారణంగా విద్యార్థులు స్కూల్‌కు వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఆన్‌లైన్‌లోనే బోధన జరుగుతుండగా.. గ్రామాల్లో ఉంటున్న విద్యార్థులకు ఈ సేవలు అందడం లేదు. అందుకే వెనుకబడిన విద్యార్థులకు మొబైల్ డివైస్ స్పాన్సర్ చేయాలని కోరింది సంజన. కరోనా వల్ల పిల్లలు నేర్చుకోవడం ఆగిపోకూడదని.. ఇందుకోసం అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చింది. మరిన్ని ఇన్నోవేటివ్ ఐడియాలతో ముందుకొచ్చి విద్యావ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుంది.. ఎలా అయితే ప్రతీ ఒక్కరికి విద్య అందుతుందో చర్చించాలని కోరింది. భారత భవిష్యత్ లీడర్స్‌తో స్పెండ్ చేయడం గర్వంగా ఉందని.. వారిని చూశాక, వారితో మాట్లాడక ఒక గొప్ప చిరునవ్వు తన పెదాలపై చేరిందని తెలిపింది సంజనా సంఘీ.

కాగా ‘దిల్ బెచారా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంజన.. సుశాంత్ సింగ్‌కు సరైన జోడీగా మెప్పించింది.

Tags:    

Similar News