ఇంటింటికి శానిటైజర్ల పంపిణీ
దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో 28 వేల శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేయిస్తున్నారు. బల్దియా చైర్మన్ కడవేర్గు రాజనర్సుతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ శానిటైజర్లను అందజేస్తున్నారు. 180 మి.లీ పరిమాణం కలిగిన సీసాను కుటుంబానికి ఒకటి చొప్పున ఇచ్చారు. తొలి రోజు 23 వార్డుల్లో ఈ ప్రక్రియ చేపట్టగా, మిగిలిన 11 వార్డుల్లో మరో 12 వేల శానిటైజర్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. గజ్వేల్ కు […]
దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో 28 వేల శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేయిస్తున్నారు. బల్దియా చైర్మన్ కడవేర్గు రాజనర్సుతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ శానిటైజర్లను అందజేస్తున్నారు. 180 మి.లీ పరిమాణం కలిగిన సీసాను కుటుంబానికి ఒకటి చొప్పున ఇచ్చారు. తొలి రోజు 23 వార్డుల్లో ఈ ప్రక్రియ చేపట్టగా, మిగిలిన 11 వార్డుల్లో మరో 12 వేల శానిటైజర్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. గజ్వేల్ కు సైతం 10 వేల శానిటైజర్లను పంపినట్లు తెలిపారు.
Tags: medak,sanitizers,distribution,minister harish rao