శానిటైజర్ తాగి.. యువకుడు మృతి

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, అనేక దేశాలను అతలాకుతలం చేస్తోంది. అయితే ఈ వైరస్ దరిచేరకుండా అందరూ సామాజిక దూరం పాటించడం, ఎక్కడికెళ్లినా మాస్క్ ధరించడం, ముఖ్యంగా ఎప్పుడూ వెంట శానిటైజర్ పెట్టుకోవడం తప్పని పరిస్థితిగా మారింది. కాగా వైరస్ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి వాడాల్సిన శానిటైజర్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మద్యానికి బానిసైన ఓ […]

Update: 2020-07-19 06:19 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, అనేక దేశాలను అతలాకుతలం చేస్తోంది. అయితే ఈ వైరస్ దరిచేరకుండా అందరూ సామాజిక దూరం పాటించడం, ఎక్కడికెళ్లినా మాస్క్ ధరించడం, ముఖ్యంగా ఎప్పుడూ వెంట శానిటైజర్ పెట్టుకోవడం తప్పని పరిస్థితిగా మారింది. కాగా వైరస్ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి వాడాల్సిన శానిటైజర్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మద్యానికి బానిసైన ఓ యువకుడు శానిటైజర్ తాగాడు. గమనించిన స్థానికులు అతన్ని స్థానిక ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి మృతిచెందాడు.

Tags:    

Similar News