షర్మిలతో మాజీ క్రికెటర్ కుమారుడు భేటీ

దిశ, వెబ్‌డెస్క్: లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిలతో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు మ‌హ్మ‌ద్ అస‌దుద్దీన్, టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా భేటీ అయ్యారు. త్వరలో షర్మిల కొత్త పార్టీని అనౌన్స్ చేయనున్న క్రమంలో.. వీరిద్దరు ఆమెను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. షర్మిలను ఎందుకు కలిశారనే విషయం ఇంకా బయటకు రాలేదు. అయితే మర్యాదపూర్వకంగా కలిశారని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని షర్మిల కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 9న ఖమ్మంలో లక్షల […]

Update: 2021-03-19 01:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిలతో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు మ‌హ్మ‌ద్ అస‌దుద్దీన్, టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా భేటీ అయ్యారు. త్వరలో షర్మిల కొత్త పార్టీని అనౌన్స్ చేయనున్న క్రమంలో.. వీరిద్దరు ఆమెను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. షర్మిలను ఎందుకు కలిశారనే విషయం ఇంకా బయటకు రాలేదు. అయితే మర్యాదపూర్వకంగా కలిశారని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని షర్మిల కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

ఏప్రిల్ 9న ఖమ్మంలో లక్షల మంది సమక్షంలో పార్టీ ప్రకటన చేయనున్నట్లు ఇటీవల షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు స్వచ్చంధంగా ఆమె పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..