యూకే వెళ్లనున్న సానియా మీర్జా
దిశ, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలో ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కనున్నది. టోక్యో ఒలింపిక్స్ ముందు కీలకమైన వింబుల్డన్‌తో పాటు ఇతర టోర్నీల్లో పాల్గొనడానికి తనకు ఇంగ్లాండ్ పర్యటన కీలకమని.. అయితే చిన్న పిల్లవాడిని ఇండియాలో వదిలి వెళ్లలేను కనుక తనకు కూడా వీసా ఇవ్వాలని కోరింది. సానియా అభ్యర్థనను పరిశీలించిన కేంద్ర క్రీడా శాఖ వెంటనే యూకే ప్రభుత్వంతో చర్చలు జరిపింది. యూఏఈ, లండన్‌లో ఉన్న భారత ఎంబసీల ద్వారా ఆమె కోసం […]
దిశ, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలో ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కనున్నది. టోక్యో ఒలింపిక్స్ ముందు కీలకమైన వింబుల్డన్‌తో పాటు ఇతర టోర్నీల్లో పాల్గొనడానికి తనకు ఇంగ్లాండ్ పర్యటన కీలకమని.. అయితే చిన్న పిల్లవాడిని ఇండియాలో వదిలి వెళ్లలేను కనుక తనకు కూడా వీసా ఇవ్వాలని కోరింది. సానియా అభ్యర్థనను పరిశీలించిన కేంద్ర క్రీడా శాఖ వెంటనే యూకే ప్రభుత్వంతో చర్చలు జరిపింది. యూఏఈ, లండన్‌లో ఉన్న భారత ఎంబసీల ద్వారా ఆమె కోసం మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ చర్చలు జరిపింది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం సానియా మీర్జాతో పాటు, కొడుకు ఇజ్‌హాన్, సోదరి ఆనమ్ మీర్జాకు వీసాలు మంజూరు చేసింది. ఇంగ్లాండ్‌లో గ్రాస్ కోర్ట్ సీజన్‌లో పాల్గొనడంతో పాటు యూఏఈలో ప్రత్యేక శిక్షణ కూడా పొందనున్నది.
‘నాకు యూకే వీసా రావడంలో సహాయం చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రెజిజు, సాయ్, యూఏఈ, లండన్‌లో ఉన్న భారత ఎంబసీలకు ప్రత్యేక ధన్యవాదములు. కొవిడ్ సమయంలో ఎక్కడికైనా ప్రయాణించాలంటే చాలా ఆంక్షలు ఉన్నాయి. క్రీడాకారులకు కూడా అంత సులభంగా వీసాలు దొరకడం లేదు. కానీ నా పరిస్థితిని అర్థం చేసుకొని భారత ప్రభుత్వం, ఇతర అధికారులు వీసా వచ్చేలా చేశారు’ అని సానియా సోషల్ మీడియాలో పేర్కొన్నది. ఒలింపిక్స్‌కు కూడా తమ వెంట చిన్నారులను అనుమతించాలని సెరేనా విలియమ్స్, సానియా మీర్జా చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు.