నీటమునిగిన సంగమేశ్వరుడు… వేసవొస్తేనే దర్శనం
దిశ, వెబ్ డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, తుంగభద్ర నదులు వరద నీటితో పోటెత్తాయి. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు నుంచి లక్షా 93ల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. దీంతో డ్యాం లో నీటి మట్టం 106 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ పెరిగిపోవడంతో సోమవారం సప్తనది సంగమేశ్వరం ఆలయం పూర్తిగా నీట మునిగినట్లు ఆలయ వేద పండితులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. photo credits: […]
దిశ, వెబ్ డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, తుంగభద్ర నదులు వరద నీటితో పోటెత్తాయి. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు నుంచి లక్షా 93ల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. దీంతో డ్యాం లో నీటి మట్టం 106 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ పెరిగిపోవడంతో సోమవారం సప్తనది సంగమేశ్వరం ఆలయం పూర్తిగా నీట మునిగినట్లు ఆలయ వేద పండితులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు.
ప్రసిద్ధ శైవాలయాలలో కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం ఒకటి. ఆత్మకూరు నుండి 20 కి.మీ దూరంలో కృష్ణ నదిలో ఈ ఆలయం ఉంటుంది. ఏకంగా ఏడు నదులు కలిసే స్థానం ఇది. ఏడాదికి 8 నెలలపాటు నీటిలోనే ఉంటుంది. మళ్ళీ వేసవిలో శ్రీశైల జలాశయంలోని నీటిమట్టం తగ్గిన తర్వాత సుమారు 4 నెలలపాటు భక్తులకు దర్శన భాగ్యం ఉంటుంది. ఏపీ, తెలంగాణ కు చెందిన భక్తులు ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు.