ఇసుకేశ్వరులు… ఇరుక్కున్నారుగా..!

దిశ, భువనగిరి: రిజర్వాయర్‎కు వెళ్లాల్సిన ఇసుక లారీ దారి తప్పింది. పాజెక్టు నిర్మాణం పేరుతో జంటనగరాలకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామ సర్పంచ్ భిక్షమమ్మ అడ్డు కోగా తనను అరెస్ట్ చేశారు. పత్రికలు టివిలు, సామాజిక మాధ్యమాల్లో వారం రోజులుగా మొత్తుకుంటున్నా.. అనుమతి పొందిన కాంట్రాక్టర్ పాడుబుద్ది పోనిచ్చుకో లేదు. బస్వాపూర్ రిజర్వాయర్‎కు వెళ్లాల్సిన ఇసుక లారీ జంట నగరాల రూట్‎కు మళ్లింది. లారీ డ్రైవర్‎కు తెలియకుండా బండ కొత్తపల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు […]

Update: 2021-04-07 07:13 GMT

దిశ, భువనగిరి: రిజర్వాయర్‎కు వెళ్లాల్సిన ఇసుక లారీ దారి తప్పింది. పాజెక్టు నిర్మాణం పేరుతో జంటనగరాలకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామ సర్పంచ్ భిక్షమమ్మ అడ్డు కోగా తనను అరెస్ట్ చేశారు. పత్రికలు టివిలు, సామాజిక మాధ్యమాల్లో వారం రోజులుగా మొత్తుకుంటున్నా.. అనుమతి పొందిన కాంట్రాక్టర్ పాడుబుద్ది పోనిచ్చుకో లేదు. బస్వాపూర్ రిజర్వాయర్‎కు వెళ్లాల్సిన ఇసుక లారీ జంట నగరాల రూట్‎కు మళ్లింది. లారీ డ్రైవర్‎కు తెలియకుండా బండ కొత్తపల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు లారీని వెంబడించారు.

మేడ్చల్ జిల్లా ఘటకేసర్‎లో ఓ భవనం వద్ద ఇసుకను పోస్తుండగా కాంట్రాక్టర్ కక్కుర్తి బుద్ధి రెడ్ హ్యాండెడ్‎గా బయటపడింది. ఆ యువకులు అన్లోడ్ అవుతున్న ఇసుక లారీ ఫోటోలతో పాటు డ్రైవర్ వద్ద ఉన్న వేబిల్‎ను సైతం తీసుకొని కెమెరాలో బంధించారు. ఆ ఫోటోలను యాదాద్రి-భువనగిరిజిల్లా కలెక్టర్, గుండాల తహశీల్దార్లకు సామాజిక మాధ్యమాల ద్వారా పంపించారు.

ఇంత జరిగినప్పటికీ ప్రభుత్వం, స్థానిక అధికార పార్టీ నేతల అండదండలతో గుండాల మండలం బండకొత్తపల్లి (యస్వంతాపూర్) వాగు నుంచి ప్రాజెక్టు‌కు తరలించాల్సిన ఇసుక పక్క దారి పట్టి, ఇసుక అక్రమ రవాణా దందా మూడుపువ్వులు.. ఆరుకాయలుగా కొనసాగుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags:    

Similar News