ఇంతవరకు బ్రేకు…ల్లేవ్!

దిశ‌, ఖ‌మ్మం: గోదావరి ఇసుకకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో గోదావరి, కిన్నెరసాని, తాలిపేరు, మున్నేరు నుంచి ఇసుక అక్రమ రవాణా నిత్యం య‌థేచ్ఛ‌గా సాగుతూనే ఉంది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో నిర్మాణ రంగం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇసుక ర‌వాణా జోరందుకుంది. ఈ దందాకు బ్రేకులు వేయాల్సిన అధికారులు చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. నిర్మాణదారుల అవ‌స‌రాల‌ను ఆస‌రాగా చేసుకుని రెట్టింపు రేట్ల‌తో ఇసుకను అమ్ముకుంటున్నారు. ఖమ్మంలోని ఇసుక డిపో […]

Update: 2020-06-08 22:36 GMT

దిశ‌, ఖ‌మ్మం: గోదావరి ఇసుకకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో గోదావరి, కిన్నెరసాని, తాలిపేరు, మున్నేరు నుంచి ఇసుక అక్రమ రవాణా నిత్యం య‌థేచ్ఛ‌గా సాగుతూనే ఉంది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో నిర్మాణ రంగం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇసుక ర‌వాణా జోరందుకుంది. ఈ దందాకు బ్రేకులు వేయాల్సిన అధికారులు చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. నిర్మాణదారుల అవ‌స‌రాల‌ను ఆస‌రాగా చేసుకుని రెట్టింపు రేట్ల‌తో ఇసుకను అమ్ముకుంటున్నారు. ఖమ్మంలోని ఇసుక డిపో అందుబాటులో ఉన్నా రోజుకు 30 ట్రాక్టర్లకు మాత్ర‌మే కూపన్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో ట్రాక్టర్‌ బాడీలెవల్‌ ఇసుకను రూ.10వేల నుంచి 12వేల వరకు అమ్ముతున్నారంటే దందా ఏ స్థాయిలో జ‌రుగుతోందో అర్థం చేసుకోవ‌చ్చు. ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట‌, పిన‌పాక‌, పాలేరు, మ‌ధిర ఇలా ఆయా ప్రాంతాల‌కు చెందిన ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతల కనుసన్నల్లోనే ఈ ఇసుక‌ దందా కొన‌సాగుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

భ‌ద్రాద్రి జిల్లాలోనే అధికం..

వాగులు, వంక‌ల‌కు నిల‌య‌మైన భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా నుంచే ఇసుక రవాణా ఎక్కువ‌గా జ‌రుగుతోంది. ఈ క‌ర‌క‌గూడెం మండ‌లంలోని గొళ్లగూడెం, అనంతారం, రేగుళ్ల, కలవలనాగారం, చొప్పాల, మోతే త‌దిత‌ర ప్రాంతాల నుంచి నిత్యం వంద‌లాది ట్రాక్ట‌ర్ల‌ను ఇసుక‌ను త‌ర‌లిస్తున్నారు. ఫ‌లితంగా భూ గ‌ర్భ‌జ‌లాలు అడ‌గంటిపోతున్నాయ‌ని స్థానిక రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెబుతున్నారు. అయితే ఇసుక దందాను అడ్డుకునేందుకు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. వాస్త‌వంలో మాత్రం అందుకు విరుద్ధంగా ప‌రిస్థితులు ఉండ‌టం గ‌మ‌నార్హం.

అలాగే దుమ్ముగూడెం మండలంలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. మండ‌లంలోని సీతారాంపురం, తూరుబాక, గుబ్బలమంగివాగు, సింగారం, పైడిగూడెం త‌దిత‌ర ప్రాంతాల నుంచి గోదావరి ఇసుక‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నారు. ఈ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇసుక‌ను డంప్ చేసినందుకు ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుకకు రూ. 1500 ఉండగా ఇప్పుడు డ‌బుల్ రేటు అంటే దాదాపు రూ. 3 వేల వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నారు. అయితే ఈ దందా అంతా కూడా స్థానికంగా ఉండే అధికారుల సాయంతోనే న‌డుస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. పోలీస్‌, రెవెన్యూ శాఖ అధికారులు అడ‌పాద‌డ‌పా దాడులు నిర్వ‌హిస్తున్నా శాశ్వ‌తంగా దందాను నిర్మూలించ‌లేక‌పోతున్నార‌ని జ‌నాలు మండిపడుతున్నారు.

Tags:    

Similar News