సింహాచలం ఆలయానికి ‘ప్రసాద్’లో చోటు : సంచైత

దిశ, వెబ్ డెస్క్ : వైజాగ్ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయం కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్’లో చోటుదక్కించుకుందని మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్ ‌పర్సన్ సంచయిత గజపతిరాజు తెలిపారు. దేశంలోని ముఖ్య‌మైన ప‌ర్యాట‌క‌, ఆధ్యాత్మిక‌, ధార్మిక ప్ర‌దేశాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్ర‌సాద్ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. ఏపీలో ఇప్పటికే శ్రీశైలం, తిరుప‌తి దేవ‌స్థానాల‌ను ఈ ప‌థ‌కం కింద‌ ఎంపిక చేసి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారు. దీనిపై సంచయిత గజపతిరాజు స్పందిస్తూ.. ‘సింహాచలం పుణ్యక్షేత్రాన్ని […]

Update: 2020-07-30 02:09 GMT

దిశ, వెబ్ డెస్క్ :
వైజాగ్ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయం కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్’లో చోటుదక్కించుకుందని మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్ ‌పర్సన్ సంచయిత గజపతిరాజు తెలిపారు. దేశంలోని ముఖ్య‌మైన ప‌ర్యాట‌క‌, ఆధ్యాత్మిక‌, ధార్మిక ప్ర‌దేశాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్ర‌సాద్ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. ఏపీలో ఇప్పటికే శ్రీశైలం, తిరుప‌తి దేవ‌స్థానాల‌ను ఈ ప‌థ‌కం కింద‌ ఎంపిక చేసి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారు.

దీనిపై సంచయిత గజపతిరాజు స్పందిస్తూ.. ‘సింహాచలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్‌’ పథకం కింద ఎంపిక చేసింది. అధికారంలో ఉండగా చంద్రబాబు గానీ, అశోక్ గజపతి గానీ కేంద్రం నుంచి ఈ గ్రాంటును తెచ్చుకోవడానికి ప్రయత్నించకపోవడం విచారకరమన్నారు. తనపై విమర్శలు చేసే తాజా పరిణామం మౌనం నేర్పిస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News