భగ్గుమన్న గజపతి రాజుల వైరం
దిశ, విశాఖపట్నం: విజయనగరం గజపతి రాజుల విషయంలో విభదాలు మరోసారి భగ్గుమన్నాయి. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న అశోక్ గజపతి రాజును తప్పించి ఆనంద గజసతిరాజు వారసరాలు సంచయిత గజపతికి ఏపీ సర్కారు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో బాబాయి-కూతర్ల మధ్య భారీ స్ధాయిలోనే మాటల యుద్ధం జరిగింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు చైర్మన్ గా ఉన్న అశోక్ ను తొలగించడమే కాకుండా వాటికి […]
దిశ, విశాఖపట్నం: విజయనగరం గజపతి రాజుల విషయంలో విభదాలు మరోసారి భగ్గుమన్నాయి. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న అశోక్ గజపతి రాజును తప్పించి ఆనంద గజసతిరాజు వారసరాలు సంచయిత గజపతికి ఏపీ సర్కారు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో బాబాయి-కూతర్ల మధ్య భారీ స్ధాయిలోనే మాటల యుద్ధం జరిగింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు చైర్మన్ గా ఉన్న అశోక్ ను తొలగించడమే కాకుండా వాటికి చైర్ పర్సన్ గా సంచయితను నియమిస్తూ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
గతంలో సంచయిత తండ్రి ఆనంద గజపతిరాజు కూడా ఇదేవిధంగా సింహాచలం దేవస్థానంతో పాటు జిల్లాలోని 104 ఆలయాలకు చైర్మన్ గా వ్యవహరించారు. ఆనంద గజపతి వారసురాలిగా సంచయితకు అదే రీతిలో ఇతర ఆలయాల బాధ్యతలను అప్పగించాలని ఏపీ సర్కారు గత నెల 27న దేవాదాయశాఖకు లేఖ రాసింది. ఈ క్రమంలో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి సంచయిత నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మరోసారి వారి ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్న పరిస్థితి ఏర్పడింది.
గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఛైర్మన్ పదవి నుంచి అశోక్ తొలగింపు
తూర్పు గోదావరి జిల్లాలో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఛైర్మన్ పదవి నుంచి ప్రభుత్వం తనను తొలగించడంపై అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్థానంలో సంచయితను నియమించడం సరికాదని అన్నారు. ప్రభుత్వ ఆర్డర్ అర్థరాత్రి జీవోలకు నిదర్శనమని విమర్శించారు. దేవదాయ భూముల లూటీకి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మాన్సాస్ వైభవం కనుమరుగయ్యేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అశోక్ గజపతిరాజు విమర్శించారు. ట్రస్ట్ కేసు కోర్టులో ఉండగా ఏపీ ప్రభుత్వం మరో జీవో ఇవ్వడం పద్దతి కాదన్నారు.